LIC Housing Finance: గుడ్ న్యూస్.. ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ హోం లోన్ వడ్డీ రేట్ల తగ్గింపు
ABN , Publish Date - Jun 22 , 2025 | 10:00 AM
హోం లోన్ కోసం చూస్తున్న వినియోగదారులకు ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ (LIC Housing Finance) సంస్థ శుభవార్త చెప్పింది. ఈ సంస్థ శనివారం తన కొత్త గృహ రుణాలపై వడ్డీ రేటును 0.50% (50 బేసిస్ పాయింట్లు) తగ్గించాలని నిర్ణయించింది. దీంతో హోం లోన్స్ వడ్డీరేటు మరింత తగ్గింది.
ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ (LIC Housing Finance) సంస్థ కస్టమర్లకు గుడ్ న్యూస్ తెలిపింది. శనివారం కొత్త గృహ రుణాలపై వడ్డీ రేటును 50 బేసిస్ పాయింట్లు (0.50%) తగ్గించినట్లు (home loan interest rates) ప్రకటించింది. ఈ సవరణతో కొత్త గృహ రుణాలపై వడ్డీ రేట్లు ఇప్పుడు 7.50% నుంచి మొదలవుతాయి. ఈ మార్పు జూన్ 19 నుంచి, సంస్థ 36వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా అమలులోకి వచ్చింది. ఈ నిర్ణయం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ద్రవ్య విధాన కమిటీ (MPC) ఇటీవల ప్రకటించిన రెపో రేటు తగ్గింపులను అనుసరించి తీసుకున్నారు.
కస్టమర్లకు ప్రయోజనం
ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ ఈ ప్రయోజనాన్ని కొత్త గృహ రుణ కస్టమర్లకు అందజేస్తూ, రుణాలను ప్రోత్సహించడమే లక్ష్యంగా పెట్టుకుంది. మా సంస్థ 36వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా గృహ యాజమాన్యాన్ని మరింత సులభతరం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ మేనేజింగ్ డైరెక్టర్ సీఈఓ త్రిభువన్ తెలిపారు. ఈ వడ్డీ రేట్ల తగ్గింపు, ఆర్‌బీఐ నిర్ణయాలకు అనుగుణంగా కస్టమర్లకు ప్రయోజనాలను అందిస్తున్నారు. ఈ చర్యతో మధ్యస్థ ఆదాయ విభాగాలలో గృహ డిమాండ్‌కు మరింత ఊపు వస్తుందని ఆయా వర్గాలు భావిస్తున్నాయి.
ఇతర బ్యాంకులు కూడా
ఈ వారం ప్రారంభంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కూడా రెపో రేటు తగ్గింపును అనుసరించి తన రుణ రేటును 50 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఈ తగ్గింపుతో ఎస్‌బీఐ రెపో లింక్డ్ లెండింగ్ రేట్ (RLLR) 7.75%కి చేరుకుంది. అలాగే, ఎస్‌బీఐ ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ బేస్డ్ లెండింగ్ రేట్ (EBLR) కూడా 8.65% నుంచి 8.15%కి తగ్గించారు. ఈ సవరణలు జూన్ 15 నుంచి అమలులోకి వచ్చాయి. ఆర్‌బీఐ చర్యను అనుసరించి, చాలా బ్యాంకులు తమ రుణ రేట్లను తగ్గించాయి. తర్వాత హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కూడా తన రుణ రేటును తగ్గించి, 3 కోట్ల రూపాయల కంటే తక్కువ మొత్తంతో ఫిక్స్‌డ్ డిపాజిట్లపై సాధారణ పౌరులకు గరిష్టంగా 6.6% వడ్డీ రేటును అందిస్తోంది.
ఇవీ చదవండి:
ఫోర్డోతో సహా ఇరాన్‌లోని అణు కేంద్రాలపై అమెరికా ఎటాక్
ఈ యాప్ 20 లక్షల పోయిన ఫోన్‌లను గుర్తించింది.. ఎలాగంటే..
మరిన్ని ఏపీ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి