CM Chandrababu: మోదీ దార్శనికతతోనే నాలుగో స్థానం
ABN, Publish Date - May 26 , 2025 | 03:55 AM
ప్రధాని మోదీ దార్శనికతతో భారత్ 4.2 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ప్రపంచంలో నాలుగో స్థానాన్ని సాధించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఈ విజయం పై అభినందనలు తెలిపారు.
4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలవడంపై చంద్రబాబు, పవన్
ఎక్స్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు ట్వీట్
అమరావతి, మే 25(ఆంధ్రజ్యోతి): ప్రధాని మోదీ విజనరీ నాయకత్వంలో భారత్ జపాన్ ఆర్థిక వ్యవస్థను దాటి 4.2 ట్రిలియన్ డాలర్లతో ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలవడం గర్వించదగ్గ విషయమని సీఎం చంద్రబాబు ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ‘2028 నాటికి జర్మనీని కూడా దాటి మూడో పెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుంది. ఇలాంటి తరుణంలో అన్ని రాష్ట్రాలూ వికసిత్ భారత్-2047 లక్ష్యాల సాధనకు కలిసికట్టుగా కృషి చేయాలి. ఏపీ భారత్‌కు గ్రోత్ ఇంజన్‌లా పనిచేస్తూ స్వర్ణాంధ్ర -2047 సాధనకు కృషి చేస్తోంది’ అని పేర్కొన్నారు. మరో ట్వీట్‌లో.. ప్రధాని మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో యోగాంధ్ర-2025ని ప్రస్తావించినందుకు ధన్యవాదాలు తెలిపారు.
Updated Date - May 26 , 2025 | 03:56 AM