ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

AP Ministers: దెయ్యాలు.. వేదాలు వల్లించినట్లు..

ABN, Publish Date - Apr 17 , 2025 | 07:23 PM

AP Ministers: అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా సైతం దక్కని వైసీపీ నేతలు చేస్తున్న నిరాధార ఆరోపణలపై కూటమిలోని మంత్రులు మండిపడుతున్నారు. ఆ క్రమంలో నిమ్మల రామానాయుడు, గొట్టిపాటి రవికుమార్‌లు వేర్వేరుగా వైసీపీ నేతల చేస్తున్న ఆరోపణలు ఖండించడమే కాకుండా.. ఆ పార్టీ నేతలపై నిప్పులు చెరిగారు.

Nimmala Ramanaidu

భీమవరం, ఏప్రిల్ 17: నాడు జగన్ పాలన చీకటి మయమైతే.. నేడు చంద్రబాబు పాలన స్వర్ణయుగమని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అభివర్ణించారు. గురువారం పాల్లకొల్ల నియోజకవర్గంలో ‘మన రైతు,మన రామానాయుడు’ కార్యక్రమంలో భాగంగా శివదేవుని చిక్కాల, బల్లిపాడు గ్రామాల్లో రూ.1.71 కోట్లతో పంట కాలువల గ్రావెల్ రహదారి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ..రాష్ట్ర బడ్జెట్లో జలవనరుల శాఖకు రూ.18,019 కోట్లు కేటాయించారని తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా లష్కర్లకు..జగన్ ప్రభుత్వం ఎగ్గొట్టిన జీతం బకాయిలు చెల్లించడానికి రూ. 6.57 లక్షలు సీఎం చంద్రబాబు విడుదల చేశారని చెప్పారు. గత ఐదేళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న ఈఎన్సీ స్థాయి నుండి కింది స్థాయి ఉద్యోగుల వరకు.. దాదాపు 400 మందికి పదోన్నతుల కల్పించామని ఆయన వివరించారు. చీకటి ఒప్పందాలతో అంతర్జాతీయ స్థాయిలో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ అపఖ్యాతి పాలయ్యాడని విమర్శించారు. ఆ పార్టీ నేతలు విద్యుత్ బిల్లులపై మాట్లాడడం చూస్తే..దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు.


ఇక అమరావతిలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ.. తిరుమల పవిత్రత గురించి మాట్లాడే నైతిక అర్హత వైసీపీకి లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వామి వారి దర్శనానికి వస్తే.. డిక్లరేషన్ కూడా ఇవ్వకుండా సంప్రదాయాలు పాటించని వాళ్లు మాపై నిందలు వేస్తారా ? అంటూ మండిపడ్డారు. కుల మతాలను రెచ్చకొట్టి రాజకీయ లబ్ది కోసం ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తే సహించేది లేదంటూ వైసీపీ నేతలను హెచ్చరించారు.

తండ్రి, బాబాయ్‌లను సైతం వదలకుండా మనుషులతో శవ రాజకీయాలు చేసి అభాసుపాలైన వాళ్లు ఇప్పుడు మూగ జీవాలను సైతం వదలట్లేదని విమర్శించారు. తిరుమల శ్రీవారి గోవులను కూడా తమ శవ రాజకీయాలకు వాడుకోవడం ఒక్క వైసీపీకే చెల్లిందంటూ ఆ పార్టీ నేతలపై గొట్టిపాటి రవికుమార్ నిప్పులు చెరిగారు.


తిరుమల తిరుపతి దేవస్థానం ఆధర్వంలో తిరుపతిలోని గోశాలలో భారీగా గోవులు మరణించాయంటూ వైసీపీ మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. వీటిని టీటీడీ తీవ్రంగా ఖండించింది. సోషల్ మీడియా వేదికగా ఈ వ్యవహారంపై జరుగుతోన్న ప్రచారాన్ని నైతం ఖండించింది. ఇదంతా పూర్తిగా వాస్తవమని టీటీడీ స్పష్టం చేసింది. అయితే ప్రభుత్వంతోపాటు టీటీడీ నిర్లక్ష్యం కారణంగానే ఈ విధంగా జరుగుతోందంటూ టీటీడీ బోర్డ్ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ చేస్తున్న విష ప్రచారంపై ప్రభుత్వంలోని పలువురు మంత్రులు తమదైన శైలిలో వైసీపీ మండిపడుతూన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

AP High Court: బోరుగడ్డ అనిల్‌కు గట్టి షాక్

Rain Alert: తెలంగాణలో కాసేపట్లో వర్షం.. ఉరుములతో కూడిన వానలు.. ఏ జిల్లాల్లో అంటే..

Gold: పోలీసుల తనిఖీలు.. 18 కేజీల బంగారం పట్టివేత

Waqf Bill: వక్ఫ్ సవరణ చట్టంపై వాదనలు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

K Ram Mohan Naidu: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుని అభినందించిన సీఎం చంద్రబాబు

తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు

AP Govt: ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ జారీ చేసిన ఏపీ ప్రభుత్వం

For AndhraPradesh News And Telugu News

Updated Date - Apr 17 , 2025 | 07:40 PM