ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Sugavasi Resignation: టీడీపీకి సుగవాసి రాజీనామా

ABN, Publish Date - Jun 08 , 2025 | 04:03 AM

ఉమ్మడి కడప జిల్లా పరిషత్‌ మాజీ చైర్మన్‌, సీనియర్‌ నేత సుగవాసి బాలసుబ్రమణ్యం టీడీపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధినేత, సీఎం చంద్రబాబుకు లేఖ పంపారు. గత ఆరునెలలుగా ప్రజలు, అభిమానులు, కార్యకర్తల అభిప్రాయం తీసుకుని..

రాయచోటి, జూన్‌ 7(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి కడప జిల్లా పరిషత్‌ మాజీ చైర్మన్‌, సీనియర్‌ నేత సుగవాసి బాలసుబ్రమణ్యం టీడీపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధినేత, సీఎం చంద్రబాబుకు లేఖ పంపారు. గత ఆరునెలలుగా ప్రజలు, అభిమానులు, కార్యకర్తల అభిప్రాయం తీసుకుని.. వాళ్ల మనోభావాల ప్రకారం రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు. 1995 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న ఆయన.. రాయచోటి జడ్పీటీసీ సభ్యుడిగా, 2000లో ఉమ్మడి కడప జిల్లా పరిషత్‌ చైర్మన్‌గా పని చేశారు. 2001లో మరోసారి రాయచోటి జడ్పీటీసీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2012లో జరిగిన ఉప ఎన్నికలో టీడీపీ తరఫున పోటీ ఓటమి పాలయ్యారు. 2024లో మరోసారి ఓటమి చెందాక పార్టీకి దూరంగా ఉన్నారు. కాగా, బాలసుబ్రమణ్యం.. మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే సుగవాసి పాలకొండ్రాయుడు పెద్దకుమారుడు. ఈ కుటుంబం 43 ఏళ్లుగా టీడీపీలో కొనసాగుతోంది. గత నెలలో పాలకొండ్రాయుడు మరణించారు. ఇదిలావుంటే, తన సోదరుడు బాలసుబ్రమణ్యం టీడీపీకి రాజీనామా చేయడం ఆయన వ్యక్తిగత విషయమని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సుగవాసి ప్రసాద్‌బాబు పేర్కొన్నారు.

Updated Date - Jun 08 , 2025 | 04:03 AM