TTD: కల్తీ నెయ్యి కేసులో 12 మందిపై సిట్ చార్జిషీటు
ABN, Publish Date - May 10 , 2025 | 04:18 AM
టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా కేసులో 12మందిపై తొలి చార్జిషీటును సిట్ అధికారులు నెల్లూరు ఏసీబీ కోర్టులో దాఖలు చేశారు. మరో పది రోజుల్లో రెండో చార్జిషీటు కూడా దాఖలయ్యే అవకాశం ఉంది
మరో పది రోజుల్లో రెండోది కూడా..
తిరుపతి, మే 9(ఆంధ్రజ్యోతి): టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసులో 12మంది నిందితులపై సిట్ అధికారులు నెల్లూరు ఏసీబీ కోర్టులో ఈ నెల 7న తొలి చార్జిషీటు దాఖలు చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు... కల్తీ నెయ్యి సరఫరాకు సంబంధించి దర్యాప్తు చేపట్టిన సిట్ తొలుత నలుగురిని, ఆపై మరో ఇద్దరిని కలిపి ఇప్పటి వరకూ ఆరుగురిని అరెస్టు చేసింది. బుధవారం నెల్లూరు ఏసీబీ కోర్టులో వీరిపై తొలి చార్జిషీటు దాఖలు చేసినట్టు తెలిసింది. వీరిలో ఇప్పటికే అరెస్టయిన ఆరుగురు మినహా మరో ఆరుగురు ఎవరనేది తెలియరాలేదు. ఈ కేసులో పది రోజుల్లో రెండో చార్జిషీటు దాఖలు చేస్తారని, అందులో ఏడు నుంచీ 12మందిని నిందితులుగా చూపే అవకాశముందని సమాచారం.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రజలను సయితం విరాళాలు అడుక్కునే పరిస్థితిలో పాక్
పాక్ దాడులపై ఎక్స్‌లో భారత ఆర్మీ పోస్ట్
For More AP News and Telugu New
Updated Date - May 10 , 2025 | 04:18 AM