ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Pawan Kalyan: సైనికులకు నైతిక మద్దతిద్దాం

ABN, Publish Date - May 10 , 2025 | 05:42 AM

పాకిస్థాన్‌పై ధర్మయుద్ధం చేస్తున్న భారత సైన్యానికి నైతిక మద్దతు అవసరమని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. దేశ భద్రత కోసం ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహించేందుకు జనసేన శాసనసభ్యులకు, జనసైనికులకు పవన్‌ ఆదేశాలు జారీ చేశారు

అమరావతి, మే 9(ఆంధ్రజ్యోతి): పాకిస్థాన్‌ మీద చేస్తున్న ధర్మయుద్ధానికి ప్రతిఒక్కరి నైతిక మద్దతు అవసరమని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అన్నారు. జనసేన పార్టీ తరఫున వచ్చే మంగళవారం ఉదయం తమిళనాడులోని తిరుత్తణి, తిరుచెందూర్‌, పళని, తిరుపరంకుండ్రమ్‌, స్వామిమలై, పలముదిర్చోళైల్లో ప్రతి క్షేత్రానికి ఒక జనసేన శాసనసభ్యుడిని, జనసైనికులను పంపించి ప్రత్యేక పూజలు చేయించాలని పార్టీ నాయకులను ఆదేశించారు. కర్ణాటకలోని కుక్కే, ఘాటీ సుబ్రహ్మణ్య క్షేత్రాలు, రాష్ట్రంలోని మోపిదేవి, బిక్కవోలులోని సుబ్రహ్మణ్య ఆలయాలు, ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వర ఆలయం, పిఠాపురం పురూహూతిక దేవి ఆలయాల్లో పూజలు చేయించాలని సూచించారు. సైన్యానికి సూర్యశక్తి తోడుండేలా వచ్చే ఆదివారం శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలోని సూర్యనారాయణ స్వామి ఆలయంలో పూజలు చేయించనున్నారు. క్రైస్తవ ధర్మాన్ని విశ్వసించేవారు చర్చిల్లో, ఇస్లాం ధర్మాన్ని ఆచరించే వారు మసీదుల్లో ప్రార్థనలు చేపట్టాలని పవన్‌ కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మిస్ వరల్డ్ 2025 వేడకలు..

ప్రజలను సయితం విరాళాలు అడుక్కునే పరిస్థితిలో పాక్

పాక్ దాడులపై ఎక్స్‌లో భారత ఆర్మీ పోస్ట్

For More AP News and Telugu New

Updated Date - May 10 , 2025 | 05:42 AM