ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

GO 117 Out: జీవో 117కు ప్రత్యామ్నాయ జీవో

ABN, Publish Date - May 10 , 2025 | 04:01 AM

వివాదాస్పదమైన జీవో 117కు ప్రత్యామ్నాయంగా కొత్త జీవోను కూటమి ప్రభుత్వం విడుదల చేయనుంది. తొమ్మిది రకాల పాఠశాలల రూపకల్పనతో టీచర్ల బదిలీలకు సిద్ధమవుతున్నారు

  • నేడు విడుదల చేసే అవకాశం

  • తొమ్మిది రకాలుగా పాఠశాలలు

  • అందుకనుగుణంగా టీచర్ల బదిలీలు

  • త్వరలోనే బదిలీలకు షెడ్యూలు

అమరావతి, మే 9(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలలపై వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 117 వివాదాస్పదంగా మారడంతో, ప్రత్యామ్నాయంగా కూటమి ప్రభుత్వం కొత్త జీవోను శనివారం విడుదల చేయనున్నట్లు తెలిసింది. ఈ ఫైలు ప్రస్తుతం సీఎం కార్యాలయంలో ఉంది. అక్కడ గ్రీన్‌సిగ్నల్‌ వచ్చిన వెంటనే జీవో విడుదల చేస్తారు. అందులో పేర్కొనే పాఠశాలల పునర్వ్యవస్థీకరణకు అనుగుణంగా ఉపాధ్యాయుల బదిలీలు చేస్తారు. త్వరలోనే బదిలీల షెడ్యూలు కూడా విడుదల కానుంది. గత ప్రభుత్వం జీవో 117తో ఆరు రకాల పాఠశాలలను అమల్లోకి తీసుకొచ్చింది. కొత్త విధానం తీసుకొస్తామన్న కూటమి ప్రభుత్వం తొలుత ఐదు రకాల పాఠశాలల విధానాన్ని ప్రతిపాదించి, ఇప్పుడు దానిని తొమ్మిది రకాలుగా మార్చింది. క్షేత్రస్థాయిలో ఏ పాఠశాలకు ఎంత మంది టీచర్లు అవసరమవుతారనేది అంచనా వేశారు. దీని ఆధారంగా బదిలీలు చేస్తారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మిస్ వరల్డ్ 2025 వేడకలు..

ప్రజలను సయితం విరాళాలు అడుక్కునే పరిస్థితిలో పాక్

పాక్ దాడులపై ఎక్స్‌లో భారత ఆర్మీ పోస్ట్

For More AP News and Telugu New

Updated Date - May 10 , 2025 | 04:01 AM