ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

MLA Somireddy: ఆ డీఎన్ఏ నిండా క్రిమినల్ ఐడియాలజీనే: ఎమ్మెల్యే సోమిరెడ్డి..

ABN, Publish Date - Jun 01 , 2025 | 05:02 PM

కడప వేదికగా మహానాడు సూపర్ సక్సెస్‌ను వైసీపీ, ఆ పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఏపీ విద్యా శాఖ మంత్రిగా లోకేశ్ చేపట్టిన సంస్కరణలు చూసి ఓర్వలేని స్థితికి ఆ పార్టీ దిగజారిందని మండిపడ్డారు.

MLA Somireddy Chandramohan Reddy

అమరావతి: కడప వేదికగా జరిగిన మహానాడు(Mahanadu) సూపర్ సక్సెస్‌ను వైసీపీ జీర్ణించుకోలేకపోతోందని సర్వేపల్లి ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (MLA Somireddy Chandramohan Reddy) అన్నారు. ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్(Minister Nara Lokesh) అభివృద్ధే లక్ష్యంగా ఆరు సూత్రాల గురించి చెప్తుంటే.. వైసీసీ మాత్రం క్రిమినల్ ఐడియాలజీని ఆవిష్కరిస్తోందని మండిపడ్డారు. ఏపీ ప్రజలు సైకిల్‌తో కొట్టి 11 స్థానాలకే పరిమితం చేసినా ఆ పార్టీ సైకోలకు బుద్ధి మాత్రం రాలేదని తీవ్రంగా స్పందించారు. వైసీపీ నేతలు, బ్లూ మీడియా ఆంధ్రప్రదేశ్ నాశనాన్ని కోరుకుంటున్నారని ఎమ్మెల్యే సోమిరెడ్డి ధ్వజమెత్తారు.


కడుపుమంట..!

ఈ సందర్భంగా ఎమ్మెల్యే సోమిరెడ్డి మాట్లాడుతూ..'కడప వేదికగా మహానాడు సూపర్ సక్సెస్‌ను వైసీపీ, ఆ పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. విద్యా శాఖ మంత్రిగా లోకేశ్ చేపట్టిన సంస్కరణలు చూసి ఓర్వలేని స్థితికి ఆ పార్టీ చేరింది. ప్రతిపక్షంలో రాజీలేని పోరాటం, అధికారం చేపట్టాక రాష్ట్ర అభివృద్ధి కోసం మా యువ నాయకుడు పడుతున్న తపన చూసి జగన్ రెడ్డి ఆయన మాజీ మంత్రులు కడుపుమంటతో రగలిపోతున్నారు. మహానాడులో రాష్ట్ర భవిష్యత్ కోసం లోకేశ్ బాబు ఆరు సూత్రాలను ప్రతిపాదిస్తే.. వైసీపీ మాత్రం తమ డీఎన్ఏలోని క్రిమినల్ ఐడియాలజీని ఆవిష్కరించింది. వైసీపీ ఆవిష్కరించిన ఆ నాలుగు అంశాలేంటో ఏపీ ప్రజలను తెలియాలి.


సైకో చేష్టలు..

ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేశ్ కుమారుడి వివాహ రిసెప్షన్ వేదిక వద్ద వైసీపీ శ్రేణుల ఆగడాలు శ్రుతిమించాయి. ఓ చిన్నారి వేసుకెళ్తున్న సైకిల్‌ను లాక్కుని గాల్లోకి ఎగరేశారు. ఆ చిన్నారి తన సైకిల్ ఇవ్వమని ఏడుస్తూ వేడుకుంటున్నా కాళ్లతో తొక్కి పైశాచిక ఆనందం పొందారు. తెనాలిలో రౌడీ షీటర్లు, గంజాయి బ్యాచ్ సభ్యులైన ముగ్గురికి పోలీస్ ట్రీట్మెంట్ ఇస్తే వాళ్లను జగన్ రెడ్డి పరామర్శిస్తాడట. ఆ ముగ్గురి క్రిమినల్ హిస్టరీ చూస్తే ఒక్కొక్కరిపై 9 కేసులు ఉన్నాయి. తిరుమల క్యూలైన్‌లో కాకినాడకు చెందిన వైసీపీ నేత అచ్చారావు.. టీటీడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశాడు. ఆ నినాదాలను వైసీపీ పేటీఎం బ్యాచ్ సోషల్ మీడియాలో వైరల్ చేసింది. తీరా చూస్తే అతని వైసీపీ నాయకుడని, ఉద్దేశ్వపూర్వకంగానే నినాదాలు చేసినట్లు తేలింది.


పరీక్షలనీ వదలరా..!

ఇక పదో తరగతి పరీక్షా పత్రాల రీవాల్యూయేషన్ అంశాన్నీ వైసీపీ రాద్ధాంతం చేస్తోంది. 2022లో రీవాల్యుయేషన్ కోసం 41,694 దరఖాస్తులు వస్తే 8,235 స్క్రిప్టులకు(20 శాతం) సంబంధించి మార్కుల్లో మార్పులొచ్చాయి. 2023లో 61,887 దరఖాస్తులు వస్తే 10,987 స్క్రిప్టుల(18 శాతం) మార్కుల్లో మార్పులు గుర్తించారు. అలాగే 2025లో 66,363 దరఖాస్తులు వస్తే 11,175 స్క్రిప్టుల(18 శాతం) మార్కుల్లో మార్పులొచ్చాయి. ఈ ఏడాది మొత్తం మూల్యాంఖనం జరిగిన స్క్రిప్టుల్లో వ్యత్యాసం గమనిస్తే కేవలం 0.006 శాతం మాత్రమే. కానీ, వైసీపీ మాత్రం లక్షలాది మంది విద్యార్థుల మనస్సుల్లో అనుమానాలు రేకెత్తించేలా వ్యవహరిస్తోంది. బ్లూ మీడియాతో వైసీపీ పేటీఎం బ్యాచ్ ఈ రాష్ట్రం నాశనమైపోవాలని కోరుకుంటోంది.


ఏ వ్యవస్థా బాగుండకూడదా?

ఏపీలో ఏ వ్యవస్థా బాగుండకూడదని వారంతా ఆశపడుతున్నారు. ప్రజలు అన్యాయానికి గురైపోవాలని, రాష్ట్రం అధోగతి పాలవ్వాలని, వైసీపీ అధికారంలోకి రావాలనే లక్ష్యాలతో బ్లూ మీడియా పత్రికలో వార్తలుంటున్నాయి. ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలు ఒక రాజకీయ పార్టీకి, ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి వస్తుండటం చాలా దురదృష్టకరం. ప్రజలు వైసీపీ అరాచకాలను గమనించే ఏడాది క్రితం సైకిల్‌తో కొట్టి 11 సీట్లకు పరిమితం చేశారు. ప్రజలు ఛీకొట్టినా ఇంకా బుద్ధి రాదా?. అధికారాన్ని అడ్డుపెట్టుకుని చేసిన స్కాములన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతున్నా సిగ్గు లేదా?. వైసీపీ హయాంలో చేసిన పాపాలు ఒకటా..రెండా. భగవంతుడు అన్నీ చూస్తున్నాడు. అనుభవించక తప్పదని' అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Fraudster Arrest: బాబోయ్.. వీడు మామూలోడు కాదు.. ఏకంగా 350 మందికి కుచ్చుటోపీ..

Telangana State Formation Day: హైదరాబాద్ చేరుకున్న జపాన్ ప్రతినిధుల బృందం.. ఎందుకంటే..

Updated Date - Jun 01 , 2025 | 05:02 PM