Nara Lokesh: చిన్నారుల ఆవేదన విని చలించిపోయిన మంత్రి లోకేష్.. బడిబాట పట్టేందుకు సాయం..
ABN, Publish Date - Jul 05 , 2025 | 03:56 PM
Nara Lokesh Supports Nellore Children: ప్రజా సమస్యలను వేగంగా పరిష్కరించడంలో.. ఆపదలో ఉన్నవారికి సాయమందించడంలో ముందుంటారు నారా లోకేష్. తాజాగా, నెల్లూరులో భిక్షాటనం చేసే ఇద్దరు చిన్నారుల ఆవేదన విని చలించిపోయిన ఆయన వెంటనే స్పందించారు. చదువుకోవాలనే వారి ఆశలకు ఊపిరిపోస్తూ అన్ని విధాలా అండగా నిలబడతామని హామీ ఇచ్చారు.
అమరావతి జులై 5: చదువంటేనే అమ్మో అని భయపడిపోతుంటారు విద్యార్థులు. అలాంటిది మాకు చదువు చెప్పించండి సారూ! అంటూ నెల్లూరులో భిక్షాటన చేసే ఇద్దరు బాలురు అధికారులను బతిమాలిన సంఘటన ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకష్ దృష్టికి వెళ్లింది. దీనిపై ఆయన వెంటనే ఎక్స్ వేదికగా ఇలా స్పందించారు.'నెల్లూరు విఆర్ స్కూలు వద్ద పెంచలయ్య, వెంకటేశ్వర్లు అనే ఇద్దరు చిన్నారులు తమకు చదువు చెప్పించాలని కమిషనర్‌ను ప్రాధేయపడటం నన్ను కదిలించింది. ఆ చిన్నారుల విద్యాభ్యాసానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాల్సిందిగా అక్కడి అధికారులను ఆదేశించాను. పేదరికం నుంచి బయటకు తెచ్చే ఒకే ఒక్క సాధనం విద్య. జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలన్న కసి, పట్టుదల ఉంటే ఎన్ని కష్టాలు ఎదురైనా లక్ష్యాన్ని చేరుకోవచ్చు. నెల్లూరులోని ఈ చిన్నారులు తమ కలలను సాకారం చేసుకునేందుకు అన్నివిధాల అండగా నిలుస్తాం' అని పోస్ట్ చేశారు.
చికిత్సకు రూ.9 లక్షలు ఇస్తాం: మంత్రి లోకేష్
అలాగే అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన వెంకటరామ శ్రీకాంత్ అనే వ్యక్తికీ ఆపదలో అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు మంత్రి లోకేష్. రోజు కూలీ చేసుకుంటూ బతికే శ్రీకాంత్ తీవ్ర అనారోగ్యంతో మంచం పట్టడంతో వాళ్ల కుటుంబ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. చికిత్సకు రూ.9 లక్షల వరకూ ఖర్చవుతుందని డాక్టర్లు చెప్పడంతో.. చివరి ప్రయత్నంగా తమ సమస్యను మంత్రి లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న శ్రీకాంత్‌తో పాటు, ఆయన తండ్రి కూడా అనారోగ్యంగా ఉన్నారని.. దయచేసి ఆదుకోవాలని ఎక్స్ వేదికగా ఓ యూజర్ చేసిన అభ్యర్థనకు చలించిపోయిన మంత్రి లోకేష్ స్పందించారు. వీలైనంత త్వరగా సాయం అందిస్తామని తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి.
రాష్ట్రంలో.. ఇక స్మార్ట్ రేషన్ కార్డులు
కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా పీఎస్‌కు మాజీ మంత్రి
Read Latest Telangana News and National News
Updated Date - Jul 05 , 2025 | 04:42 PM