ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Minister Anita: తప్పులు చేసిన వారికి కులమేంటి

ABN, Publish Date - Jun 03 , 2025 | 06:13 AM

తెనాలిలో పోలీసులపై దాడిచేసిన నేరస్తులకు కులం లేదా మతం ఏ ప్రయోజనమూ లేదని హోంమంత్రి అనిత పేర్కొన్నారు. ఈ ఘటనకు రాజకీయ రంగు వేస్తూ బాధితులకు సమాధానం చెప్పాల్సిందిగా మంత్రి నాదెండ్ల ప్రశ్నించారు.

  • పోలీసులపై దాడి చేసిన వారికి మద్దతా: హోం మంత్రి

  • బాధితులకు ఏం సమాధానం చెబుతారు: మంత్రి నాదెండ్ల

అమరావతి/విజయవాడ, జూన్‌ 2(ఆంధ్రజ్యోతి): తప్పు చేసిన వారికి కులం, మతమేంటని హోంమంత్రి అనిత మండిపడ్డారు. తెనాలిలో పోలీసులపై దాడిచేసిన వారి నేరచరిత్ర ఏంటి? వారిపై ఎన్ని కేసులు ఉన్నాయి? అనే విషయాన్ని డీజీపీ ప్రకటన ద్వారా తెలిపారన్నారు. చట్టాన్ని ఎక్కడా పోలీసులు చేతిలోకి తీసుకోలేదని స్పష్టం చేశారు. పోలీసులపై చేయిచేసుకున్న వారికి రాజకీయ రంగు పులిమి మద్దతు ఇస్తున్నారా అని ప్రశ్నించారు. కాగా, తెనాలి పట్టణాన్ని గత వైసీపీ ప్రభుత్వం హయాంలో గంజాయికి అడ్డాగా మార్చేశారని మంత్రి నాదెండ్ల మనోహర్‌ విమర్శించారు. తెనాలి పర్యటనకు వస్తున్న జగన్‌.. తాను సృష్టించిన గంజాయి గ్యాంగ్‌ల బాధితులకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.

Updated Date - Jun 03 , 2025 | 06:15 AM