ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

AP Govt: 60 వేల బడులు, కాలేజీల్లో మెగా పీటీఎం 2.0

ABN, Publish Date - Jul 11 , 2025 | 02:39 AM

కూటమి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన మెగా పేరెంట్‌- టీచర్స్‌ సమావేశాలు(పీటీఎం 2.0) విజయవంతమయ్యాయి. గురువారం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 60 వేల పాఠశాలలు, జూనియర్‌ కాలేజీల్లో పండుగ వాతావరణంలో పీటీఎంలు జరిగాయి.

త్వరలో ఎన్టీఆర్‌ విదేశీ విద్య అమలు ప్రారంభం

వేడుకగా బడి పండుగ

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

కూటమి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన మెగా పేరెంట్‌- టీచర్స్‌ సమావేశాలు(పీటీఎం 2.0) విజయవంతమయ్యాయి. గురువారం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 60 వేల పాఠశాలలు, జూనియర్‌ కాలేజీల్లో పండుగ వాతావరణంలో పీటీఎంలు జరిగాయి. ఈసారి ప్రైవేటు విద్యా సంస్థలు కూడా మెగా పీటీఎంకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చాయి. ఈ కార్యక్రమాల్లో తల్లిదండ్రులు, పాఠశాల మేనేజ్‌మెంట్‌ కమిటీలు, దాతలు, పూర్వవిద్యార్థులు పెద్దఎత్తున పాల్గొన్నారు. దాదాపు 2.28 కోట్ల మంది మెగా పీటీఎంలో పాల్గొంటారని అంచనా వేయగా భారీగా హాజరు నమోదైందని అధికార వర్గాలు తెలిపాయి. లీప్‌ యాప్‌ సర్వర్‌ డౌన్‌ కావడంతో పాల్గొన్నవారి పేర్ల నమోదులో జాప్యం ఏర్పడింది. శ్రీసత్యసాయి జిల్లా కొత్తచెరువు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌, మిగిలిన జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు పీటీఎంలలో పాల్గొన్నారు. పలుచోట్ల పెండింగ్‌లో ఉన్న పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. ఈసారి పీటీఎంలో అకడమిక్‌ అంశాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. విద్యార్థి పురోగతిపై తల్లిదండ్రులకు హోలిస్టిక్‌ ప్రోగ్రెస్‌ కార్డులు అందజేశారు. తరగతి టీచర్‌తో తల్లిదండ్రులు వ్యక్తిగతంగా మాట్లాడే అవకాశం కల్పించారు. ఫ్యామిలీ ఫొటో బూత్‌లు ఆకట్టుకున్నాయి. విద్యార్థులతో మొక్కలు నాటించి వాటిని సంరక్షించే బాధ్యతను అప్పగిస్తూ వారికి గ్రీన్‌ పాస్‌పోర్టులు జారీ చేశారు. మెగా పీటీఎంల నిర్వహణపై పాఠశాలలకు సంబంధించిన వారితో కాకుండా ఇతరులతో సాక్షి సంతకాలు చేయించడంద్వారా గిన్నిస్‌ రికార్డు నమోదుకు చర్యలు తీసుకున్నారు. శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా కళాశాల మెగా పీటీఎంలో కేంద్ర మంత్రి రామ్మోహన్‌, విశాఖపట్నంలోని కేఎన్‌ఎం ఉన్నత పాఠశాలలో ఎంపీ ఎం.శ్రీభరత్‌, సాలూరు జూనియర్‌ కళాశాల, మక్కువ ఉన్నత పాఠశాల మెగా పీటీఎంలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, బాపట్ల జిల్లా రేపల్లె పాఠశాలలో మంత్రి అనగాని సత్యప్రసాద్‌, తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు జూనియర్‌ కళాశాల, పాఠశాల పీటీఎంలో మంత్రి కందుల దుర్గేశ్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 11 , 2025 | 02:41 AM