Nara Lokesh: ప్రధానికి సైన్యానికి అండగా నిలుద్దాం
ABN, Publish Date - May 08 , 2025 | 06:18 AM
మంత్రివర్యులు లోకేశ్ దేశంలో క్లిష్ట పరిస్థితులలో ప్రధాని మోదీకి, సైన్యానికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. సైనికులపై ఒప్పిన ప్రాముఖ్యమైన నిర్ణయంగా ఆపరేషన్ సిందూర్‌ను ప్రశంసించారు
తిరుపతి, మే 7(ఆంధ్రజ్యోతి): దేశంలో క్లిష్ట పరిస్థితులు నెలకొన్న ఈ సమయంలో అందరం ప్రధాని మోదీకి, సైన్యానికి అండగా నిలుద్దామని మంత్రి లోకేశ్ పిలుపునిచ్చారు. బుధవారం రాత్రి ఆయన తిరుపతి జిల్లా సత్యవేడులో నియోజకవర్గ టీడీపీ ఉత్తమ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఉగ్రమూకలపై ఆపరేషన్ సిందూర్ పేరిట ప్రధాని సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని ప్రశంసించారు. అందరం తొలుత భారతీయులమని, సరిహద్దుల్లో యుద్ధం చేస్తున్న సైనికులకు సంఘీభావం తెలపాలని కోరారు. పార్టీ పదవులు, నామినేటెడ్ పదవులు ఆశించేవారు తప్పనిసరిగా కుటుంబ సాధికార సారథులు(కేఎ్‌సఎ్‌స)గా పని చేయాల్సిందేనని లోకేశ్ కుండబద్దలు కొట్టారు. సమావేశం అనంతరం లోకేశ్ రాత్రికి సత్యవేడులోనే బస చేశారు. గురువారం ఉదయం శ్రీసిటీలో ఎల్జీ పరిశ్రమకు శంకుస్థాపన చేసి అనంతరం హైదరాబాద్ వెళ్లనున్నారు.
Updated Date - May 08 , 2025 | 06:18 AM