ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Machilipatnam: బీచ్ ఫెస్టివల్‌కు ఊహకు అందని విధంగా పర్యాటకులు

ABN, Publish Date - Jun 08 , 2025 | 09:33 AM

Machilipatnam Beach: మచిలీపట్నం మసులా బీచ్ ఫెస్టివల్‌కు ఊహకు అందని విధంగా పర్యాటకులు వచ్చారని, బీచ్ ఫెస్టివల్ నిర్వహణకు సంబంధించి సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం చేశారని మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. టూరిజం అభివృద్ధికి ఈ బీచ్ ఫెస్టివల్ తొలి మెట్టు అని, గతంలో బీచ్ ఫెస్టివల్ అంటే గోవాకు, శ్రీలంకకు వెళ్లాల్సి వచ్చేదని... ఇప్పుడు ఆ అవసరం లేదన్నారు.

Machilipatnam Mussala Beach Festival

Machilipatnam: బీచ్ ఫెస్టివల్‌కు ఊహకు అందని విధంగా పర్యాటకులు

Krishna Dist: మచిలీపట్నం (Machilipatnam) మసులా బీచ్ (Mussala Beach) ఫెస్టివల్‌ (Festival)కు ఊహకు అందని విధంగా పర్యాటకులు (Tourists) వచ్చారని, బీచ్ ఫెస్టివల్ నిర్వహణకు సంబంధించి సీఎం చంద్రబాబు (CM Chandrababu) దిశా నిర్దేశం చేశారని మంత్రి కొల్లు రవీంద్ర (Minister Kollu Ravindra) చెప్పారు. టూరిజం అభివృద్ధికి (Tourism development) ఈ బీచ్ ఫెస్టివల్ తొలి మెట్టు అని, గతంలో బీచ్ ఫెస్టివల్ అంటే గోవాకు, శ్రీలంకకు వెళ్లాల్సి వచ్చేదని... ఇప్పుడు ఆ అవసరం లేదన్నారు. అమరావతి నిర్మాణానికి మచిలీపట్నం బీచ్ దగ్గరగా ఉందని, పోర్టు కూడా త్వరలో అందుబాటులోకి రానుందని మంత్రి తెలిపారు.

ఓటుతో ప్రజలు ఛీ కొట్టినా..

కాగా అమరావతి మహిళలపై జరుగుతున్న దుష్ప్రచారంపై మంత్రి కొల్లు రవీంద్ర స్పందించారు. దుర్మార్గమైన వ్యక్తులు ఇటువంటి మాటలు మాట్లాడతారని, ఓటుతో ప్రజలు ఛీ కొట్టినా వారికి సిగ్గు రాలేదని అన్నారు. మహిళలు అనే గౌరవం కూడా వారికి లేదని మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రస్థాయిలో మండిపడ్డారు.


24 రాష్ట్రాల నుంచి క్రీడాకారులు..

మచిలీపట్నం బీచ్ ఫెస్టివల్‌ను ఎంతో అద్భుతంగా చేస్తున్నారని, కబడ్డీ, వాలీబాల్ పోటీలను నిర్వహిస్తున్నారని, ఇక్కడికి వచ్చిన తర్వాత తాను రిలాక్స్ అయ్యానని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అన్నారు. 80 అడుగుల ఎత్తుతో గేట్ వే ఆఫ్ నిర్మాణం చేశారని, 10 ఏళ్ల వరకు ఎవరు కదపలేని విధంగా నిర్మాణ చేశారన్నారు. రోల్డ్ గోల్డ్, కలంకారి, వంటి వాటికి ప్రాధాన్యత ఇచ్చారని, సినీ కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. 24 రాష్ట్రాల నుంచి క్రీడాకారులు వచ్చారని, 2018లో నిర్వహించిన బీచ్ ఫెస్టివల్‌కు 10 లక్షల మంది వచ్చారని.. ఈసారి 20 లక్షల మంది పర్యాటకులు వస్తారని అంచనా వేస్తున్నామని మంత్రి అన్నారు.


పర్యాటక రంగానికి సీఎం అధిక ప్రాధాన్యత..

సీఎం చంద్రబాబు పర్యాటక రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తారని, రాష్ట్రాల అభివృద్ధిలో పర్యాటక రంగం కీలకమైనదని మంత్రి నారాయణ అన్నారు. మాజీ సీఎం జగన్‌కు ఆర్థిక వ్యవస్థ మీద అవగాహన లేదని ఎద్దేవా చేశారు. వైసీపీ హయాంలో ఆర్థిక వ్యవస్థను చిన్నాభినం చేశారని.. రూ. 10 లక్షల కోట్ల అప్పులు చేశారని విమర్శించారు. ప్రతి మీటింగ్‌లో కూడా పర్యాటక రంగంలో కొత్త ప్రాజెక్టులు ఏమన్నా వచ్చాయా అని సీఎం చంద్రబాబు అడుగుతారని.. రాష్ట్రానికి రూ. 8,500 కోట్లు అమృత స్కీమ్ కింద కేంద్రం ఇచ్చిందని, మచిలీపట్నం డంపింగ్ యార్డు పనులు జరుగుతున్నాయని, అక్టోబర్ 2 నాటికి పూర్తి చేస్తామని మంత్రి నారాయణ పేర్కొన్నారు.


రాష్ట్ర జీడీపీ పెరుగుతోంది...

కృష్ణాజిల్లా వాసిని అయినా బీచ్ ఫెస్టివల్ ఇంత ఘనంగా చేస్తారని ఎప్పుడూ చూడలేదని మంత్రి కొలుసు పార్ధ సారథి అన్నారు. కేవలం 5 రోజులకే ఇంత మంది పర్యాటకులు వస్తే.. ఇక్కడ శాశ్వత ఏర్పాట్లు చేస్తే నిత్యం పెద్ద సంఖ్యలో పర్యటకులు తరలి వస్తారని అన్నారు. టూరిజం అభివృద్ధి చేస్తే రాష్ట్ర జీడీపీ పెరుగుతుందని మంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు.


ఇవి కూడా చదవండి:

మాగంటి మృతి పట్ల ప్రముఖుల సంతాపం

ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి

For More AP News and Telugu News

Read Latest and Crime News

Updated Date - Jun 08 , 2025 | 09:33 AM