AP NEWS: సైనేడ్‌తో హత్యలు.. విజయవాడ కోర్టు సంచలన తీర్పు
ABN, Publish Date - Jun 27 , 2025 | 07:46 PM
సైనేడ్ ఉపయోగించి పది హత్యలు చేసిన నిందితులకు జీవిత కారాగార శిక్ష, జరిమానాలను విజయవాడ న్యాయస్థానం విధించింది. 2019వ సంవత్సరంలో ఏలూరులో కాటి నాగరాజు అనుమానాస్పద మృతిపై 174 సీఆర్‌పీసీ కేసుగా నమోదైంది.
విజయవాడ: సైనేడ్ (Cyanide Case) ఉపయోగించి పది హత్యలు చేసిన నిందితులకు జీవిత కారాగార శిక్ష, జరిమానాలను విజయవాడ న్యాయస్థానం (Vijayawada Court) విధించింది. 2019వ సంవత్సరంలో ఏలూరులో కాటి నాగరాజు అనుమానాస్పద మృతిపై 174 సీఆర్‌పీసీ కేసు నమోదైంది. అప్పటి ఏలూరు డీఎస్పీ దిలీప్ కిరణ్, ఏలూరు రూరల్ సీఐ అనుసూరి శ్రీనివాసరావులు ఈ కేసు దర్యాప్తు జరిపారు. నాగరాజుని సైనేడ్ ఉపయోగించి హత్య చేశారని పోలీసులు గుర్తించారు.
ఈ కేసులో ఏలూరుకు చెందిన వెల్లంకి సింహాద్రిని, విజయవాడకు చెందిన షేక్ అమీనుల్లా బాబులను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. విజయవాడ అజిత్‌సింగ్ నగర్‌లో భాస్కర్‌ని కూడా సైనేడ్ ఇచ్చి చంపినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ విచారణలో మరో ఏడుగురిని కూడా సైనేడ్ ఇచ్చి హతమార్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. నిందితులు వెల్లంకి సింహాద్రి, షేక్ అమీనుల్లా బాబుపై నేరం రుజువు కావడంతో నిందితులకు జీవిత ఖైదుతో పాటు, ఒకొక్కరికి రూ. 25 వేలు జరిమానాను ఏడో అదనపు జిల్లా సెషన్స్ జడ్జి బందెల అబ్రహం విధించారు. అయితే ఈ విచారణలో 11 మంది సాక్షులను న్యాయస్థానం విచారించింది.
ఇవి కూడా చదవండి
AP Tourism: పర్యాటక రంగం.. సీఎం సూచనలతోనే ముందుకు: మంత్రి దుర్గేష్
సింగయ్య మృతి కేసు.. జగన్ వాహనం చెకింగ్
Read Latest AP News And Telugu News
Updated Date - Jun 27 , 2025 | 07:58 PM