ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Minister Lokesh: పేద‌ల పాలిట వ‌రమైన ఆర్డీటీ సేవ‌లు ఆగ‌వు..

ABN, Publish Date - Jun 06 , 2025 | 02:12 PM

Minister Lokesh: విద్య‌, వైద్య‌, విజ్ఞాన‌, ఉపాధి వికాస రంగాల ద్వారా తెలుగు రాష్ట్రాల్లో పేద‌ల అభ్యున్న‌తికి కృషి చేస్తున్నామని విద్య‌, ఐటీ శాఖ‌ల మంత్రి నారా లోకేష్ తెలిపారు. అనంతపురం, శ్రీసత్యసాయి, కర్నూలు, నంద్యాల జిల్లాలతోపాటు తెలంగాణలోని మహబూబ్‌నగర్‌ వంటి ప్రాంతాల్లో ఆర్డీటీ ద్వారా కార్యక్రమాలు జరుగుతున్నాయని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.

Minister Nara Lokesh

అమరావతి: పేద‌ల పాలిట వ‌రమైన ఆర్డీటీ సేవ‌లు (RDT services) ఆగ‌వని, కేంద్రంతో నిరంత‌ర సంప్ర‌దింపులు జరుపుతున్నామని ఏపీ విద్య‌,ఐటీ శాఖ‌ల మంత్రి నారా లోకేష్ ( Minister Nara Lokesh) పేర్కొన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన అమరావతి (Amaravati)లో మీడియాతో మాట్లాడుతూ.. రాయలసీమ (Rayalaseema)తో పాటు తెలంగాణ (Telangana)లోని పలు ప్రాంతాల్లో గ్రామీణులకు సేవలందిస్తున్న రూరల్‌ డెవలప్‌మెంట్‌ ట్రస్టు (RDT) సేవలు నిరంత‌రాయంగా కొన‌సాగేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. కేంద్ర ప్ర‌భుత్వంతోనూ, సంబంధిత ఉన్న‌తాధికారుల‌తోనూ, సంస్థ‌ల‌తోనూ సంప్ర‌దింపులు జరుపుతున్నామన్నారు.


తెలుగు రాష్ట్రాల్లో 3,500 గ్రామాల్లో ఆర్డీటీ సేవలు.

విద్య‌, వైద్య‌, విజ్ఞాన‌, ఉపాధి వికాస రంగాల ద్వారా తెలుగు రాష్ట్రాల్లో పేద‌ల అభ్యున్న‌తికి కృషి చేస్తున్నామని మంత్రి లోెకేష్ తెలిపారు. అనంతపురం, శ్రీసత్యసాయి, కర్నూలు, నంద్యాల జిల్లాలతోపాటు తెలంగాణలోని మహబూబ్‌నగర్‌ వంటి ప్రాంతాల్లో ఈ సంస్థ కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో 3,500 గ్రామాల్లో ఆర్డీటీ సేవలు అమలవుతున్నాయని తెలిపారు. శ్రీసత్యసాయి జిల్లాలోని బత్తులపల్లి, అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గం, కణేకల్లు ప్రాంతాల్లో 600కుపైగా పడకలతో మూడు ఆసుపత్రులను ఆర్డీటీ నిర్వహిస్తోందన్నారు. ఏటా 8.5 లక్షల మంది అవుట్‌పేషెంట్లు, 60 వేలకుపైగా ఇన్‌పేషెంట్లకు సేవలు అందున్నాయన్నారు. కరోనా సమయంలో బత్తలపల్లి ఆర్డీటీ ఆసుపత్రిని కొవిడ్‌ సెంటర్‌గా మార్చగా.. పది వేల మందికి చికిత్స అందిందని గుర్తు చేశారు. అలాగే మూగ, చెవిటి, మానసిక వికలాంగులైన విద్యార్థులకు అనంతపురంలో మూడు ప్రాథమిక, రెండు ఉన్నత పాఠశాలలను ఆర్డీటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు మంత్రి లోకేశ్ చెప్పుకొచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సీఎం రేవంత్ రెడ్డితో మీనాక్షి నటరాజన్ కీలక భేటీ

ఘనంగా అఖిల్, జైనాబ్‌ల వివాహం..

For More AP News and Telugu News

Updated Date - Jun 06 , 2025 | 03:02 PM