ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

APPSC Case: మరో కీలక సూత్రధారి కోసం పోలీసుల వేట..

ABN, Publish Date - May 27 , 2025 | 09:29 AM

APPSC Group1 Case: ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 మెయిన్స్‌ జవాబు పత్రాల మూల్యాంకనం కుంభకోణం కేసులో విచారణ జరుపుతున్న కొద్దీ కొత్త కొత్త విషయాలు, పేర్లు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో మధును విచారించగా క్యామ్‌సైన్‌ సంస్థ ఉద్యోగి రఘు పేరు వెలుగులోకి వచ్చింది. దీంతో అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

APPSC Group1 Case

విజయవాడ: ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 (APPSC Group 1) మెయిన్స్‌ జవాబు పత్రాల మూల్యాంకనం కుంభకోణం కేసు (Answer Sheet Scam Case)లో మరో కీలక సూత్రధారి రఘు (Raghu) కోసం పోలీసులు (Police) గాలింపు చర్యలు చేపట్టారు. హాయ్‌ల్యాండ్‌ (Highland)లో ఏర్పాటు చేసిన మాన్యువల్ మూల్యాంకన శిబిరానికి ఎటువంటి అర్హత లేని దాదాపు 40 మందిని క్యామ్‌సైన్‌ సంస్థ తీసుకొచ్చిందని.. వారిలో కొందరి వివరాలు గల్లంతు కావడంపై అధికారులు మధును ప్రశ్నించారు. సమాధానం చెప్పకుండా విషయం దాటవేశారు. ఆ 40 మందిని తమ సంస్థలోని రఘు అనే ఉద్యోగి తీసుకొచ్చారని మధు తెలిపారు. దీంతో రఘు కోసం పోలీసులు పత్యేక బృందాలతో గాలిస్తున్నారు.


కాగా గ్రూప్‌-1 అక్రమాల కేసులో ప్రధాన నిందితుడు, ఏపీపీఎస్సీ మాజీ కార్యదర్శి పీఎస్‌ఆర్‌ ఆంజనేయులను రెండో రోజు విచారించారు. అయితే విచారణలో పీఎస్‌ఆర్‌ దాటవేత ధోరణి ప్రదర్శించారు. ఒక్క ప్రశ్నకూ ఆయన సూటిగా సమాధానం చెప్పలేదు. ఎక్కడా తప్పు జరగలేదని, నిబంధనల మేరకే నడుచుకున్నానని చెప్పేందుకే ప్రయత్నించారు. పీఎస్‌ఆర్‌కు సోమవారం దాదాపు 25 ప్రశ్నలు సంధించగా పది ప్రశ్నలకు సమాధానమే ఇవ్వలేదని సమాచారం. ఈ కేసులో ఏ2గా ఉన్న మదుసూధన్‌ను కూడా పోలీసులు విచారించారు. సుమారు 14 ప్రశ్నలు అడిగి కీలకమైన విషయాలు రాబట్టినట్లు తెలియవచ్చింది. మాన్యువల్‌ మూల్యాంకనం చేయకుండానే చేశామని అనడం వెనుక ప్రధానంగా ఎవరున్నారు... ఏ1, ఏ2 మధ్య సంబంధం, పరిచయం తదితర అంశాలపై పోలీసులు దృష్టి సారించారు. ఇద్దరినీ వేర్వేరు గదుల్లో ఉంచి విచారించారు. మొదటి రోజు సరిగా సమాధానం చెప్పని ప్రశ్నలను రెండో రోజూ అడిగారు. దీంతో రెండు రోజుల కస్టడీ ముగియడంతో ఇద్దరినీ ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించి.. అక్కడి నుంచి విజయవాడ జిల్లా జైలుకు తరలించారు.

Also Read: అదే నా ఆశ… ఆకాంక్ష..సీఎం చంద్రబాబు


కాగా ఏపీపీఎస్సీ గ్రూప్‌ 1 జవాబు పత్రాల మూల్యాంకనం వ్యవహారంలో ముగ్గురు కమిషన్‌ ఉద్యోగుల పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వారిని కూడా ఈ కేసులో నిందితులుగా చేర్చేందుకు సిద్ధమవుతున్నారు. గ్రూప్‌1 జవాబు పత్రాల మూల్యాంకనం కేసులో మాజీ ఇంటెలిజెన్స్‌ డీజీ పీఎస్సార్ ఆంజనేయులుతో పాటు క్యామ్‌సైన్‌ సంస్థ ప్రతినిధి మధును పోలీసులు విచారించారు. జవాబు పత్రాల మూల్యాంకనం వ్యవహారంలో క్యామ్‌సైన్‌ సంస్థకు పనులు అప్పగించడంపై పోలీసులు ఆరా తీశారు. గ్రూప్‌ 1 జవాబు పత్రాలను మూల్యాంకనం చేసే సమయంలో కోర్టు వివాదాలు తలెత్తడంతో వాటిని హాయ్‌లాండ్‌లో మూల్యాంకనం చేశారు. ఈ పనులు ఎవరి ద్వారా ప్రైవేట్‌ సంస్థకు అప్పగించారనే కోణంలో పోలీసులు ఆరా తీశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తొలి రోజు 23 వేల మంది ప్రతినిధులతో మహానాడు

కోనసీమలో విషాదం.. ఒక మృత దేహం లభ్యం..

For More AP News and Telugu News

Updated Date - May 27 , 2025 | 09:29 AM