CM Chandrababu: ఉరకలేసే యువత తెలుగుదేశం ఆస్తి..
ABN, Publish Date - May 27 , 2025 | 08:28 AM
CM Chandrababu: ప్రపంచ దేశాల్లో తెలుగు వారు ఎక్కడ ఉన్నా ఆ దేశానికే తలమానికంగా మారాలనేది మన సంకల్పమని, అందుకే మనం నిరంతరం శ్రమిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తెలుగుదేశం ఎదుర్కొన్న పరీక్షల్లో ప్రతిసారీ విజేతగానే నిలిచిందన్నారు.
అమరావతి: కడప (Kadapa) గడపలో తెలుగుదేశం పార్టీ (TDP) నిర్వహించే పసుపు పండుగ (Pasupu Panduga) మంగళవారం ఉదయం మా తెలుగు తల్లికి గీతాలాపనతో మహానాడు సభలు లాంఛనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు (CM Chandrababu) సోషల్ మీడియా ఎక్స్ (Social Media X) వేదికగా పోస్టు (Post) చేశారు. తెలుగుదేశం మహా పండుగ ‘మహానాడు’ సందర్భంగా కార్యకర్తలు, నాయకులు, అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. ఉత్తుంగ తరంగంలా ఎగసిపడే ఉత్సాహం తెలుగుదేశం కార్యకర్తల సొంతమని, ఉరకలేసే యువత తెలుగుదేశం ఆస్తి అని వ్యాఖ్యానించారు. తరతరాల తెలుగు ఖ్యాతిని జగద్విదితం చేయడం తెలుగుదేశం పవిత్ర కర్తవ్యంగా పేర్కొన్నారు.
ప్రపంచ దేశాల్లో తెలుగు వారు ఎక్కడ ఉన్నా..
ప్రపంచ దేశాల్లో తెలుగు వారు ఎక్కడ ఉన్నా ఆ దేశానికే తలమానికంగా మారాలనేది మన సంకల్పమని, అందుకే మనం నిరంతరం శ్రమిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తెలుగుదేశం ఎదుర్కొన్న పరీక్షల్లో ప్రతిసారీ విజేతగానే నిలిచిందన్నారు. గడచిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విశ్వరూప సందర్శనం చరిత్రలో నిలిచిపోతుందని.. ఈ క్రమంలో ప్రభుత్వం ఏర్పాటయ్యాక జరుపుకుంటున్న మహానాడును తొలిసారి కడపలో నిర్వహించ తలపెట్టామని అన్నారు. మహానాడు సందర్భంగా ప్రజా సేవకు పునరంకితమవుతూ ‘యువగళం’కు ప్రాధాన్యతనివ్వాలని, ‘అన్నదాతకు అండగా’ నిలవాలని,‘స్త్రీ శక్తి’కి పెద్దపీట వేయాలని, ‘పేదల సేవలో’ నిరంతరం శ్రమించాలని, ‘తెలుగు జాతి విశ్వఖ్యాతి’ లక్ష్యాన్ని సాధించే దిశగా కార్యాచరణ ఉండాలని, ‘కార్యకర్తే అధినేత’గా మారాలనే నూతన మార్గదర్శకాలతో…. ఇనుమడించిన ఉత్సాహంతో మనం ముందుకు సాగాలి…. అదే నా ఆశ… ఆకాంక్ష.. అంటూ సీఎం చంద్రబాబు ఎక్స్‌లో పేర్కొన్నారు.
Also Read: తొలి రోజు 23 వేల మంది ప్రతినిధులతో మహానాడు
ప్రతి ఒక్కరు తరలి రావాలి.. మంత్రి సవిత
కాగా కడపలో మంగళవారం నుంచి మూడు రోజులపాటు జరగనున్న టీడీపీ మహానాడు పండుగను జయప్రదం చేయాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి సవితమ్మ పిలుపునిచ్చారు. కడప జిల్లా నాయకులు కోరిక మేరకు మహానాడు జరుపుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్ నిర్ణయించడం.. అందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని ఆమె అన్నారు. టీడీపీ మహానాడు పండుగను పురష్కరించుకుని కడపలో జరిగే సభకు ప్రతి ఒక్కరు తరలి రావాలని మంత్రి సవిత పిలుపునిచ్చారు. కడపలో 43వ మహానాడు పండుగ జరుగబోతోందన్నారు. కడప తొలి గడప అనే కడపలో చంద్రబాబు, లోకేష్ మహానాడు పండుగ జరుపుకోవడానికి నిర్ణయించడం.. చరిత్రలో నిలిచిపోయే విధంగా ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి రావాలన్నారు. జనసమీకరణ కోసం 13 కమిటీలను ఏర్పాటు చేశారన్నారు. తెలుగుదేశం పార్టీ బడుగు, బలహీన వర్గాల నడుమ పుట్టిన పార్టీ అని, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు స్థాపించారని ఇది తెలుగు ప్రజలకు ఒక వరమన్నారు. తాము మహానాడుకు మూడు లక్షల మంది టార్గెట్ అనుకుంటే ప్రస్తుతం 5 నుంచి 6 లక్షల మంది ప్రజలు రాబోతున్నట్లు ఆమె తెలిపారు. మహానాడు సభకు జమ్మలమడుగు నియోజకవర్గంలోని భారీ నుంచి అతి భారీగా టీడీపీ ఇన్‌చార్జి భూపేశ్‌రెడ్డితో కలిసి ప్రజలు రావాలని మంత్రి సవిత పిలుపునిచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కోనసీమలో విషాదం.. ఒక మృత దేహం లభ్యం..
For More AP News and Telugu News
Updated Date - May 27 , 2025 | 10:08 AM