ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

TDP Mahanadu 2025: ఆరు శాసనాలతో విశ్వఖ్యాతికి తెలుగుజాతి

ABN, Publish Date - May 28 , 2025 | 11:59 AM

TDP Mahanadu 2025: మళ్ళీ జన్మ అంటూ ఉంటే తెలుగువాడి గానే పుట్టాలని కోరుకుంటున్నానని సీఎం చంద్రబాబు అన్నారు. కార్యకర్తే అధినేత అని.. వారే తనకు హైకమాండ్ అని చెప్పుకొచ్చారు.

TDP Mahanadu 2025

అమరావతి, మే 28: రెండవ రోజు టీడీపీ మహానాడు వైభవంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆరు శాసనాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) మహానాడు వేదికపై మాట్లాడారు. ఆరు శాసనాలు ద్వారా పార్టీ భవిష్యత్తు మారుతుందన్నారు. ఈ ఆరు శాసనాల ద్వారా 2047 నాటికి తెలుగు జాతి విశ్వఖ్యాతి సాధిస్తుందనే నమ్మకం తనకుందన్నారు. ‘అందరూ గుర్తుంచుకోండి... రాబోయే కాలంలో తెలుగుజాతి ప్రపంచంలో నంబర్ వన్‌గా ఉంటుందని చెబుతున్నాను.. ఇది సీబీఎన్ కోట్’ అని పేర్కొన్నారు. రాబోయే 47 సంవత్సరాలకు ఒక రోడ్ మ్యాప్‌ను రూపకల్పన చేశామన్నారు.


ఎప్పటికప్పుడు నూతన నాయకత్వాన్ని కూడా తీసుకొస్తున్నామని అన్నారు. మళ్ళీ జన్మ అంటూ ఉంటే తెలుగువాడి గానే పుట్టాలని కోరుకుంటున్నానని సీఎం వెల్లడించారు. కార్యకర్తే అధినేత అని.. వారే తనకు హైకమాండ్ అని చెప్పుకొచ్చారు. లోకేష్‌కు ఉండే నాలెడ్జ్‌ ఆధారంగా ఆరు శాసనాలు ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ఎప్పటికప్పుడు ప్రజాభిప్రాయాన్ని తీసుకుంటామన్నారు. 43 ఏళ్ళుగా టీడీపీ జెండా రెపరెపలాడుతోందంటే అది కార్యకర్తల త్యాగం అని చెప్పుకొచ్చారు. కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎప్పుడు ఎన్నికలు పెట్టినా టీడీపీ గెలవాలన్నారు. ప్రజలకు అండగా ఉండాలని... వారి కోసం పని చేయాలని కార్యకర్తలకు సూచించారు.


అప్పుడే పార్టీకి ఆదరణ ఉంటుందని వెల్లడించారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేసి గుండెపోటు అని చెప్పారని... రెండవ రోజు నారాసుర రక్త చరిత్ర అని వాళ్ళ పేపర్‌లో వేశారని మండిపడ్డారు. ఇటువంటి నరరూప రాక్షసులతో రాజకీయం చేస్తున్నామన్నారు. పల్నాడులో హత్యలు చేస్తున్నారని.. కొంతమంది టీడీపీలో ఉండి కోవర్టులుగా మారి వాళ్ల టార్గెట్‌లను హత్య చేస్తున్నారని మండిపడ్డారు. కోవర్ట్‌ల ద్వారా వారి అజెండాను అమలు చేయాలంటే కుదరదని స్పష్టం చేశారు. వలస పక్షులు వచ్చి వెళుతూ ఉంటాయని... కానీ కార్యకర్తలు శాశ్వతంగా ఉంటారని అన్నారు.


సామాజిక న్యాయం గురించి చాలామంది మాట్లాడారని.. కానీ సామాజిక న్యాయాన్ని టీడీపీ అమలు చేసి చూపించిందన్నారు. ఆడబిడ్డలపైనే సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ప్రభుత్వం ఊరుకోదని హెచ్చరించారు. డ్వాక్రా మహిళలు లక్ష మంది పారిశ్రామికవేత్తలుగా ఈ ఏడాది చేస్తున్నామన్నారు. తల్లికి వందనం ఈనెల లేదా వచ్చే నెల ఇచ్చేస్తామని తెలిపారు. ఆగస్టు 15 నుంచి మహిళకు ఆర్టీసీ బస్‌లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామని ప్రకటించారు సీఎం. నీటి పారుదల ప్రాజెక్టులను కూడా పూర్తి చేస్తామన్నారు. యువశక్తిని నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. తనను జైలులో పెడితే 83 దేశాల్లో యువత నిరసనలు చేసిందని.. అందుకనే తనకు యువత అంటే ఎనలేని ప్రేమ అని చెప్పుకొచ్చారు. ఆరు సూత్రాలు గేమ్ చేంజర్‌గా ఉపయోగపడతాయన్నారు. పార్టీ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందన్నారు. ఈ ఆరు శాసనాలను చివరి వరకు తీసుకువెళ్ళాలని కార్యకర్తలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు.


ఇవి కూడా చదవండి

తెలుగు జాతికి పండుగ రోజు.. మహానాడులో ఏపీ సీఎం

ఎన్టీఆర్‌కు ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు ఘన నివాళి

Read Latest AP News And Telugu News

Updated Date - May 28 , 2025 | 01:29 PM