ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Minister Nara Lokesh: మంగళగిరి అభివృద్ధికి మంత్రి నారా లోకేష్ కీలక నిర్ణయం

ABN, First Publish Date - 2025-04-04T12:58:31+05:30

Minister Nara Lokesh: మంగళగిరి అభివృద్ధిపై మంత్రి నారా లోకేష్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మంగళగిరిలో దశాబ్దాల సమస్యకు పదినెలల్లో పరిష్కారం చూపామని మంత్రి నారా లోకేష్ అన్నారు.

Minister Nara Lokesh:

అమరావతి: మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లిలో ‘మన ఇల్లు - మన లోకేష్’ కార్యక్రమం చేపట్టారు. రెండో రోజు శాశ్వత ఇంటి పట్టాలను విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అందజేశారు. ఇవాళ్టి నుంచి 12వ తేదీ వరకు నియోజకవర్గంలో ‘మన ఇల్లు - మన లోకేష్’ కార్యక్రమం జరుగనుంది. పేదలకు స్వయంగా శాశ్వత ఇంటి పట్టాలను మంత్రి నారా లోకేష్ పంపిణీ చేస్తున్నారు. యర్రబాలెం గ్రామానికి చెందిన 248మందికి శాశ్వత ఇంటి పట్టాలను పంపిణీ చేశారు. ఇవాళ మధ్యాహ్నం నుంచి నీరుకొండ గ్రామానికి చెందిన 99మందికి, రత్నాల చెరువుకు చెందిన 199మందికి శాశ్వత ఇంటి పట్టాలు పంపిణీ చేయనున్నారు. మొత్తంగా 546 మంది లబ్ధిదారులకు శాశ్వత ఇంటి పట్టాలను నారా లోకేష్ ఉచితంగా అందజేయనున్నారు. సొంత ఖర్చులతో బట్టలు పెట్టి మరీ లబ్ధిదారులకు ఇంటి పట్టాలను లోకేష్ అందజేస్తున్నారు.


ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మీడియాతో మాట్లాడారు. మంగళగిరిలో దశాబ్దాల సమస్యకు పదినెలల్లో పరిష్కారం చూపామని అన్నారు. తొలి విడతలో ప్రభుత్వ స్థలాల్లో నివసిస్తున్న మూడు వేలమందికి శాశ్వత పట్టాలు అందజేస్తామని అన్నారు. మంగళగిరి ప్రజల కోసం 26 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. సూపర్ 6 హామీలు ఓ పద్ధతి ప్రకారం అమలు చేస్తూనే... మంగళగిరిలో ఏ సమస్య లేకుండా చూసుకుంటానని మాటిచ్చారు.


ఈ ఏడాది ఏప్రిల్ 13వ తేదీన మంగళగిరిలో వందపడకల ఆస్పత్రికి భూమి పూజ చేసి వచ్చే ఏడాది ఏప్రిల్ 13వ తేదీకి ప్రారంభిస్తామని అన్నారు. కుప్పంతో పాటు మంగళగిరిని కూడా తెలుగుదేశం కంచుకోటగా మారుస్తామని సీఎం చంద్రబాబుకు ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నందుకు సంతోషంగా ఉందని తెలిపారు. మంగళగిరి పేదలకు ఇంటి పట్టాల పంపిణీ రెండున్నర దశాబ్దాల కల అని చెప్పారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన పదినెలల్లో ఇంటిపట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టామని అన్నారు. తమకు ఎవరి ద్వారా లబ్ధి చేకూరిందో ప్రజలు గుండెల మీద చేయి వేసి ఆలోచించుకోవాలని చెప్పారు. ఓడిన చోటే గెలిచి చూపాలని మంగళగిరిపై ప్రత్యేక దృష్టి సారించానని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

AP High Court TTD Case: శ్రీనివాస దీక్షితులుకు ఏపీ హైకోర్ట్‌ షాక్

Ancient temples: భారతదేశంలో అతి పురాతనమైన ఐదు ఆలయాల గురించి తెలుసా.

Borugadda Anil: రాజమండ్రి నుంచి అనంతపురానికి బోరుగడ్డ.. ఎందుకంటే

Read Latest AP News And Telugu News

Updated Date - 2025-04-04T13:01:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising