ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Vijayasai Reddy: మరోసారి విజయసాయి రెడ్డికి సీఐడీ నోటీసులు

ABN, Publish Date - Mar 18 , 2025 | 03:26 PM

Vijayasai Reddy: మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి సీఐడీ అధికారులు మరోసారి నోటీసులు ఇచ్చారు. కాకినాడ సీ పోర్ట్, సెజ్ వ్యవహారంలో విజయసాయి రెడ్డిపై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సీఐడీ నోటీసులు ఇచ్చారు.

Vijay Sai Reddy CID Notices

అమరావతి: మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి (Vijayasai Reddy) మంగళగిరి సీఐడీ అధికారులు మరోసారి నోటీసులు ఇచ్చారు ఈ నెల 25వ తేదీన విజయసాయి రెడ్డి మళ్లీ విచారణకు రావాలని నోటీసులో తెలిపారు. కాకినాడ సీ పోర్ట్, సెజ్ వ్యవహారంలో గత బుధవారం విచారణకు సీఐడీ అధికారులు పిలిచిన విషయం తెలిసిందే. విజయవాడ సీఐడీ కార్యాలయంలో 5 గంటల పాటు విజయసాయి రెడ్డిని విచారణ చేశారు. అవసరమైతే మళ్లీ రావాలని సీఐడీ అధికారులు చెప్పారు. ఆ మేరకు విజయసాయి రెడ్డికి సీఐడీ అధికారులు మళ్లీ నోటీస్‌లు జారీ చేశారు.


కాగా..కాకినాడ సీపోర్టు ప్రైవేటు లిమిటెడ్‌ అధిపతి కేవీ రావు నుంచి అక్రమంగా వాటాలను బదిలీ చేసుకున్నారన్న ఆరోపణలపై విజయసాయిరెడ్డిని గతంలో మంగళగిరి సీఐడీ పోలీసులు ప్రశ్నించారు. వాటాలు ఏ విధంగా తీసుకున్నారు, బలవంతంగా లాక్కున్నారా, బలవంతంగా తీసుకుంటే ఇందులో ఎవరెవరి పాత్ర ఎంత ఉందనే విషయాలపై అధికారులు విచారణ జరిపారు. కేవీ రావు ఫిర్యాదు మేరకు విజయసాయిరెడ్డితో పాటు మెుత్తం ఐదుగురిపై సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు ఈ కేసులో ఏ-1 విక్రాంత్ రెడ్డి,ఏ-2 విజయసాయిరెడ్డి, ఏ-3 శరత్ చంద్రారెడ్డి, ఏ-4 శ్రీధర్, ఏ-5గా అరబిందో రియాల్టీ ఇన్‌ఫ్రా ఉన్నారు. గతంలో ఇచ్చిన నోటీసుల్లో 506, 384, 420, 109, 467, 120(B) రెడ్ విత్ 34 ఐపీసీ సెక్షన్లను సీఐడీ అధికారులు ప్రస్తావించారు.


ఈ వార్తలు కూడా చదవండి

Posani : ముగిసిన పోసాని సీఐడీ కస్టడీ విచారణ

WhatsApp Governance: మా లక్ష్యమిదే.. వాట్సప్‌ గవర్నెన్సుపై లోకేష్

Botsa request to Pawan: పవన్‌ను సమయం కోరిన బొత్స.. ఎందుకంటే

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 18 , 2025 | 03:42 PM