Home » CID
పరకామణి కేసులో వైవీ సుబ్బారెడ్డిని సీఐడీ ప్రశ్నించింది. ఆయన స్టేట్మెంట్ను అధికారులు రికార్డ్ చేశారు. టీటీడీ మాజీ ఛైర్మన్ను అడిషనల్ డీజీ రవి శంకర్ అయ్యన్నర్ విచారించారు.
ఐ బొమ్మ రవి కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులోకి తెలంగాణ సీఐడీ అధికారులు ఎంటర్ అయ్యారు. ఈ క్రమంలో ఐబొమ్మ రవి వివరాలు సేకరించి విచారణ జరుపుతున్నారు.
ఇటీవల బెట్టింగ్ యాప్ల బారిన పడి పలువురు యువకులు ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిన ప్రముఖులను సీఐడీ సిట్ అధికారులు వరుసగా విచారిస్తున్నారు. ఈ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం.
టీటీడీకి సంబంధించి కల్తీ నెయ్యి, పరకామణిలో చోరీ కేసులకు సంబంధించి తిరుపతిలో ముమ్మరంగా విచారణ జరుగుతోంది. ఒకవైపు సీఐడీ.. మరోవైపు సీబీఐ భాగస్వామ్యమున్న సిట్ ఆధ్వర్యంలో దర్యాప్తు జరుగుతోంది.
ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కేసులో సీఐడీ దూకుడు పెంచింది. ఈ కేసులో నోటీసులు అందుకున్న హీరో విజయ్ దేవరకొండ.. సీఐడీ ముందు విచారణకు హాజరయ్యారు.
CID Complaint: దల్జీత్ సింగ్ కుటుంబం ఆధ్వర్యంలో అమీర్పేట్ క్రికెట్ క్లబ్, ఖాల్సా క్లబ్లు నడుస్తున్నాయి. గతంలో మల్టీపుల్ క్లబ్ ఓనర్షిప్ నిబంధనల ఉల్లంఘనతో 57 క్లబ్బులపై జస్టిస్ లావు నాగేశ్వరరావు వేటు వేశారు.
Uppal Stadium CID Raids: హెచ్సీఏ అక్రమాల కేసులో సీన్ రీకన్స్ట్రక్షన్ జరుగుతోంది. సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం ఏ1 నిందితుడు జగన్ మోహన్ రావును ఉప్పల్ స్టేడియంకు తీసుకెళ్లారు సీఐడీ అధికారులు.
HCA Scam ED Enters: హెచ్సీఏపై నమోదు చేసిన కేసు వివరాలు ఇవ్వాలని సీఐడీకి ఈడీ లేఖ రాసింది. ఎఫ్ఐఆర్, రిమాండ్ రిపోర్టు, కేసు వివరాలు, వాంగ్మూలాలు ఇవ్వాలని కోరింది.
HCA Scam CID Investigation: హెచ్సీఏ స్కాంలో అరెస్ట్ అయిన ఐదుగురిలో నలుగురు చర్లపల్లి జైలులో ఉండగా.. కవిత చంచల్ గూడ మహిళా జైలులో ఉన్నారు. ఈ ఐదుగురిని కస్టడీలోకి తీసుకుంటే హెచ్సీఏకు సంబంధించిన అవకతవకలు, హెచ్సీఏ అధ్యక్షుడిగా జగన్మోహన్ రావు ఎన్నికపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు సీఐడీ అధికారులు భావిస్తున్నారు.
HCA SRH Dispute: నకిలీ పత్రాలతోనే జగన్ మోహన్ రావు క్లబ్ ఏర్పాటు చేసినట్లు సీఐడీ విచారణలో బయటపడింది. గౌలిపుర క్రికెట్ క్లబ్ బీఎన్ అధ్యక్షుడు సి.కృష్ణ యాదవ్ సంతకాన్ని జగన్ మోహన్ రావు ఫోర్జరీ చేశారు.