CID Complaint: హెచ్‌సీఏ వైస్ ప్రెసిడెంట్, జాయింట్ సెక్రటరీలపై సీఐడీకి ఫిర్యాదు..
ABN , Publish Date - Aug 10 , 2025 | 10:59 AM
CID Complaint: దల్జీత్ సింగ్ కుటుంబం ఆధ్వర్యంలో అమీర్‌పేట్ క్రికెట్ క్లబ్, ఖాల్సా క్లబ్‌లు నడుస్తున్నాయి. గతంలో మల్టీపుల్ క్లబ్ ఓనర్‌షిప్ నిబంధనల ఉల్లంఘనతో 57 క్లబ్బులపై జస్టిస్ లావు నాగేశ్వరరావు వేటు వేశారు.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు దల్జీత్ సింగ్, జాయింట్ సెక్రటరీ బసవరాజుపై హెచ్‌సీఏ మాజీ కోశాధికారి చిట్టి శ్రీధర్ సీఐడీకి ఫిర్యాదు చేశారు. ఆ ఇద్దరూ మల్టీపుల్ క్లబ్ ఓవర్‌షిప్ ప్రయోజనాలతో హెచ్‌సీఏ ఎన్నికల్లో గెలుపు సాధించారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఐడీతో పాటు అంబుడ్స్‌మన్‌కు కూడా చిట్టి శ్రీధర్ ఫిర్యాదు చేశారు. బసవరాజు 2022 వరకు కమర్షియల్ ట్యాక్సెస్ క్రికెట్ క్లబ్‌కు ప్రాతినిధ్యం వహించారు.
ప్రభుత్వ ఉద్యోగం నుంచి రిటైర్‌మెంట్ తీసుకున్న తర్వాత దల్జీత్ సింగ్ కుటుంబానికి చెందిన అమీర్‌పేట్ క్రికెట్ క్లబ్ ఉపాధ్యక్షుడిగా 2023లో బాధ్యతలు చేపట్టారు. దల్జీత్ సింగ్ కుటుంబం ఆధ్వర్యంలో అమీర్‌పేట్ క్రికెట్ క్లబ్, ఖాల్సా క్లబ్‌లు నడుస్తున్నాయి. గతంలో మల్టీపుల్ క్లబ్ ఓనర్‌షిప్ నిబంధనల ఉల్లంఘనతో 57 క్లబ్బులపై జస్టిస్ లావు నాగేశ్వరరావు వేటు వేశారు. అదే రూల్ ప్రకారం.. దల్జీత్ సింగ్ కుటుంబానికి సంబంధించిన క్లబ్‌లపైనా వేటు వేయాలని చిట్టి శ్రీధర్ తన ఫిర్యాదులో కోరారు.
ఆ రెండు క్లబ్‌ల నుంచి హెచ్‌సీఏ ఉపాధ్యక్షుడు, జాయింట్ సెక్రటరీ పోస్టులు దక్కించుకున్నారని ఆరోపించారు. అక్రమంగా ఎన్నికైన హెచ్‌సీఏ కార్యవర్గాన్ని రద్దు చేసి.. తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని చిట్టి శ్రీదర్ డిమాండ్ చేశారు. హెచ్‌సీఏ అంబుడ్స్‌మన్‌కు అందిన ఫిర్యాదు ఆధారంగా సీఐడీ అధికారులు చిట్టి శ్రీధర్ నుంచి సమాచారం సేకరించారు.
ఇవి కూడా చదవండి
అరె వో సాంబా... పూరా పచాస్ సాల్..
ప్రయాణికురాలికి పాడైపోయిన సీట్, ఇండిగో విమానయాన సంస్థకు రూ.1.5 లక్షల జరిమానా