Share News

Fine on Indigo: ప్రయాణికురాలికి పాడైపోయిన సీట్, ఇండిగో విమానయాన సంస్థకు రూ.1.5 లక్షల జరిమానా

ABN , Publish Date - Aug 10 , 2025 | 10:41 AM

ఓ మహిళా ప్రయాణికురాలికి అపరిశుభ్రమైన, తడిసిన సీటును కేటాయించినందుకు ఇండిగో విమానయాన సంస్థ భారీ జరిమానా చెల్లించాల్సి వస్తోంది. ఎయిర్‌లైన్స్ సేవా లోపం కారణంగా రూ.1.5 లక్షలు చెల్లించాలని ఢిల్లీ వినియోగదారుల ఫోరం ఆదేశించింది.

Fine on Indigo: ప్రయాణికురాలికి పాడైపోయిన సీట్, ఇండిగో విమానయాన సంస్థకు రూ.1.5 లక్షల జరిమానా
Fine on Indigo

ఓ మహిళా ప్రయాణికురాలికి అపరిశుభ్రమైన, తడిసిన సీటును కేటాయించినందుకు ఇండిగో (Indigo) విమానయాన సంస్థ భారీ జరిమానా (Fine) చెల్లించాల్సి వస్తోంది. ఎయిర్‌లైన్స్ సేవా లోపం కారణంగా రూ.1.5 లక్షలు చెల్లించాలని ఢిల్లీ వినియోగదారుల ఫోరం ఆదేశించింది. పింకీ అనే మహిళ ఈ ఏడాది జనవరి రెండో తేదీన బాకు నుంచి న్యూఢిల్లీ (New Delhi)కి ఇండిగో విమానంలో ప్రయాణించారు.


ఆ సమయంలో ఆమెకు ఇండిగో విమానంలో బాగా తడిసిపోయిన, మురికిగా ఉన్న సీటును కేటాయించారు (Dirty Seat To Passenger). ఆ సీట్ మార్చమని అడిగిన తర్వాత కూడా సిబ్బంది నుంచి స్పందన లేదు. దీంతో ఆ సీటులోనే పింకీ ప్రయాణించారు. అనంతరం తనకు కలిగిన అసౌకర్యం గురించి ఢిల్లీ వినియోగదారుల ఫోరంకు ఫిర్యాదు చేశారు. అయితే ఇండిగో ఎయిర్‌లైన్స్ మరో వాదనను వినిపించింది. సీటు విషయంలో పింకీ ఎదుర్కొంటున్న సమస్యను గుర్తించి ఆమెకు వేరే సీటు కేటాయించామని, ఆమె ఇష్టపూర్వకంగానే న్యూఢిల్లీకి తన ప్రయాణాన్ని పూర్తి చేశారని ఎయిర్‌లైన్స్ తెలిపింది.


ఇరు పక్షాల వాదనలు విన్న వినియోగదారుల ఫోరం, అందుబాటులో ఉన్న సాక్ష్యాలను పరిశీలించి తుది తీర్పు వెల్లడించింది. ఇండిగో విమానయాన సంస్థలో సర్వీస్ లోపం ఉందని విచారణలో తేలింది. దీంతో ప్రయాణికురాలు ఎదుర్కొన్న అసౌకర్యం, మానసిక వేదనకు సంబంధించి ఆమెకు పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ప్రయాణికురాలికి రూ.1.5 లక్షలు చెల్లించాలని తీర్పునిచ్చింది.


ఇవి కూడా చదవండి

ఉద్యోగం పోయిన తర్వాత లోన్ EMIలు చెల్లించాలా? మారటోరియం?

ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 10 , 2025 | 10:41 AM