Share News

CID: శ్రేయా ఇన్‌ఫ్రా కంపెనీపై ఏపీ CID చర్యలు.. ఆస్తులు తాత్కాలిక జప్తు!

ABN , Publish Date - Jan 02 , 2026 | 02:02 PM

ఏపీలోని శ్రేయా ఇన్‌ఫ్రా కంపెనీలపై ఏపీ సీఐడీ, స్థానిక పోలీసులు చేపట్టిన చర్యలు మరింత వేగవంతమయ్యాయి. ఈ సంస్థపై వందల కోట్ల రూపాయల కుంభకోణం ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే.

CID: శ్రేయా ఇన్‌ఫ్రా కంపెనీపై ఏపీ CID చర్యలు.. ఆస్తులు తాత్కాలిక జప్తు!
Shreya Infra Andhra Pradesh CID

ఆంధ్రప్రదేశ్ లోని శ్రేయా ఇన్‌ఫ్రా కంపెనీలపై (Shreya Infra/Marketing) ఏపీ సీఐడీ (CID) చర్యలు వేగవంతం చేసింది. ఈ కంపెనీపై వందల కోట్ల కుంభకోణం ఆరోపణలు ఉన్న నేపథ్యంలో సీఐడీతోపాటు, స్థానిక పోలీసులు చర్యలు చేపట్టారు. శ్రేయా ఇన్‌ఫ్రా డైరెక్టర్లు, వారి బంధులు పేరిట ఉన్న స్థిరాస్తులును డిపాజిటర్ల రక్షణ చట్టం కింద అటాచ్ (జప్తు) చేసే ప్రక్రియలో భాగంగా సీఐడీ అధికారులు ఈ రోజు (శుక్రవారం) క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపినట్లు సమాచారం. దాదాపు రూ.206 కోట్లు వరకు మోసం జరిగిందని ప్రాథమికంగా గుర్తించినట్లు తెలుస్తుంది.


ఇన్‌ఫ్రా వల్ల నష్టపోయిన 8 వేల మంది బాధితుల బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించడానికి ప్రత్యేక డెస్స్ ఏర్పాటు చేశారు. ఈ సంస్థకు చెందిన కీలక వ్యక్తులు పరారీలో ఉండగా, వారి ఆచూకీ కోసం సీఐడీ బృందాలు ఇతర రాష్ట్రాల్లోనూ సోదాలు నిర్వహిస్తుంది. తక్కువ సమయంలో పెట్టిన పెట్టుబడికి అధిక వడ్డీలు ఇస్తామని, రియల్ ఎస్టేట్ ప్లాట్లు కేటాయిస్తామని మాయ మాటలు చెప్పి వేల మంది అమయాకులను ఈ సంస్థ డిపాజిట్లు సేకరించింది. గడువు ముగిసినా డిపాజిటర్లకు డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఈ కుంభకోణంలో కీలక వ్యక్తులు ఉండటంతో కేసును సీఐడీకి అప్పగించారు.


ఇవీ చదవండి:

బలహీనంగా ఉన్నా.. అన్నాడీఎంకేనే మా ప్రత్యర్ధి

గాలి జనార్దన్ రెడ్డితోపాటు పలువురిపై కేసు నమోదు

Updated Date - Jan 02 , 2026 | 02:02 PM