ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Kannappa Movie: కన్నప్ప సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ అడ్డుకుంటాం.. బ్రాహ్మణ సంఘాల వార్నింగ్

ABN, Publish Date - Jun 07 , 2025 | 07:53 AM

కన్నప్ప సినిమాలో తమను కించపరుస్తున్నారంటూ బ్రాహ్మణ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. కన్నప్ప సినిమాలో పిలక, గిలక పాత్రలు లేవని ప్రీరిలీజ్ ఈవెంట్‌లో అధికారికంగా ప్రకటించాలని బ్రాహ్మణ చైతన్య వేదిక అధ్యక్షుడు శ్రీధర్ డిమాండ్ చేశారు. ఈ పాత్రపై స్పష్టత ఇవ్వకపోతే కోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు.

Kanappa movie controversy

గుంటూరు జిల్లా: తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం కన్నప్ప సినిమా (Kannappa Movie) చాలా ఆసక్తికరంగా మారింది. మంచు విష్ణు (Manchu Vishnu) ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఈ భారీ పౌరాణిక చిత్రం వివాదాల చుట్టూ తిరుగుతోంది. విడుదలకు ముందే ఈ చిత్రం అనేక అడ్డంకులను ఎదుర్కొంటుంది. ఈ చిత్రానికి సంబంధించిన హర్డ్‌డిస్క్ కూడా మాయమవడంతో ఈ మూవీ టీమ్ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. అయితే ఈ చిత్రంలోని రెండు పాత్రలు మాత్రం ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఈ నెల (జూన్) 27వ తేదీన విడుదల కాబోయే కన్నప్ప సినిమాలో తమను కించపరుస్తున్నారంటూ బ్రాహ్మణ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ మూవీలోని పిలక, గిలక పాత్రలపై బ్రాహ్మణ సంఘాలు మండిపడుతున్నాయి. గుంటూరులో ఇవాళ(శనివారం) కన్నప్ప సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు.


ప్రీరిలీజ్ ఈవెంట్‌ని అడ్డుకుంటామని బ్రాహ్మణ సంఘాలు హెచ్చరించాయి. ఈ మేరకు బ్రాహ్మణ చైతన్య వేదిక అధ్యక్షుడు శ్రీధర్ ఓ ప్రకటన విడుదల చేశారు. బ్రాహ్మణులను కించపరచడం మంచు మోహన్‌బాబు కుటుంబానికి అలవాటేనని ధ్వజమెత్తారు. గతంలోనూ చాలా సినిమాల్లో బ్రాహ్మణులను కించపరిచారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కన్నప్ప సినిమాలో పిలక, గిలక పాత్రలు లేవంటూ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో అధికారికంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ పాత్రలపై స్పష్టత ఇవ్వకపోతే కోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు. బ్రాహ్మణులను కించపరిచే విధంగా పాత్రలతో సినిమాలు నిర్మించడం ఇప్పటికైనా మంచు మోహన్‌బాబు కుటుంబం మానుకోవాలని బ్రాహ్మణ చైతన్య వేదిక అధ్యక్షుడు శ్రీధర్ కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి

తిరుమల లడ్డూ.. భక్తుల విశ్వాసానికి ప్రతీక

డీమ్డ్‌ యూనివర్సిటీగా ఆదిశంకర

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 07 , 2025 | 04:22 PM