ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

CM Chandrababu: గంజాయి, బెట్టింగ్ బ్యాచ్‌లు, రౌడీలకు విగ్రహాలు పెడతారా: సీఎం చంద్రబాబు

ABN, Publish Date - Jun 19 , 2025 | 04:59 PM

తాము ఎవరినీ టార్గెట్ చేయడం లేదు.. చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. కొందరికి క్రైమ్ కూడా అలవాటు అయిపోయిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

AP CM Nara Chandrababu Naidu

అమరావతి: మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) సత్తెనపల్లి పర్యటన సందర్భంగా అల్లర్లు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Nara Chandrababu Naidu) స్పందించారు. ఇవాళ(గురువారం) ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ఓ వైపు యోగా జరుగుతుంటే.. మరోవైపు వైసీపీ శ్రేణులు రఫ్ఫా రఫ్ఫా అంటున్నారని మండిపడ్డారు. చంపండి.. నరకండి.. అని ఎవరైనా అంటారా అని ప్రశ్నించారు. గంజాయి, బెట్టింగ్ బ్యాచ్‌లు, రౌడీలకు విగ్రహాలు పెడతారా అని నిలదీశారు సీఎం చంద్రబాబు.

ప్రజలను ఇబ్బంది పెడతారా..

ఇరుకు వీధుల్లో మీటింగ్‌లు పెట్టి ప్రజలను ఇబ్బంది పెడతారా అని సీఎం చంద్రబాబు అడిగారు. హింసను ప్రోత్సహించి పోలీసులపై నిందలు మోపుతారా అని ఫైర్ అయ్యారు. ఏపీలో ఎప్పుడైనా ఇలాంటి పోకడలు చూశారా అని ప్రశ్నించారు. నేరస్థులతో రాజకీయాలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. తాము ఎవరినీ టార్గెట్ చేయడం లేదు.. చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేశారు. రౌడీయిజం చేసేవారిని, చట్టాన్ని ఉల్లంఘించేవారిని వదిలేయాలా అని నిలదీశారు. ఒక్కసారి ఉన్మాదులుగా మారితే వారిని మార్చగలమా అన్నారు. భవిష్యత్‌ను తీర్చిదిద్దే నాయకుల గురించి ప్రజలు ఆలోచించాలని కోరారు సీఎం చంద్రబాబు.

ఇప్పుడు రఫ్ఫా రఫ్ఫా అంటున్నారు..

‘కొందరికి క్రైమ్ కూడా అలవాటు అయిపోయింది. అంతా యోగా చేస్తే పబ్లిక్ అటెన్షన్ డైవర్ట్ చేయాలని ఇలాంటివి చేస్తున్నారు. ఇప్పుడు రఫ్ఫా రఫ్ఫా అంటున్నారు. గంగమ్మ జాతరలో పొట్టేలు నరికినట్లుగా నరికేస్తాం అంటున్నారు. ఒకప్పుడు చెడ్డ లక్షణాలు ఉన్న వ్యక్తిని రాజకీయాల్లో దూరం పెట్టేవారు. ఇప్పుడు వారినే వెనకేసుకుని తిరుగుతున్నారు. మేము ఎప్పుడైనా పోలీసులు వద్దంటే నిబంధనలకు విరుద్ధంగా వెళ్లామా. గంజాయి, బెట్టింగ్ బ్యాచ్, అత్యాచారాలు చేసే వారికి విగ్రహాలు పెడుతున్నారు. ఏపీలో గంజాయి చాలా వరకు కంట్రోల్ చేశాం. గంజాయి, డ్రగ్స్ అరికట్టడానికి ఈగల్ టీం ఏర్పాటు చేశాం’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

జగన్ హయాంలో ఎన్నో అరాచకాలు...

‘గత జగన్ ప్రభుత్వ హయాంలో ఎన్నో అరాచకాలు జరిగాయి. తాను చేసిందే చట్టం అంటే ఎలా కుదురుతుంది. మీరు మారాలి.. లేకుంటే ప్రజలు మార్చాలి. వైసీపీ నేతలు సమాజానికే పెద్ద సమస్యగా మారిపోయారు. అన్ని నేరాల్లో వాళ్లే ఉంటున్నారు.. మళ్లీ రాజకీయం చేస్తున్నారు. ప్రశాంతంగా ఉండే కుప్పంలో అలజడి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. తప్పుడు పనులతో అతలాకుతలం చేస్తామంటే సరికాదు. ఏడాది క్రితం చనిపోయిన వ్యక్తికి ఇప్పుడు పరామర్శా. వైసీపీ హయాంలోనే నాగమల్లేశ్వరరావు చనిపోయాడు. వైసీపీ నేతల వాహనం ఢీకొని చనిపోతే పట్టించుకోరా. రౌడీయిజం చేయాలని అందరినీ ప్రోత్సహిస్తున్నారు’ అని సీఎం చంద్రబాబు ప్రశ్నల వర్షం కురిపించారు.

మేము ఎందుకు భయపడతాం..

‘ఏపీ మొత్తం ఒక మంచి పని చేస్తే వైసీపీ నేతలు మాత్రం నేరాలకు పాల్పడుతున్నారు. నేరస్థుల మెంటాలిటీ అలానే ఉంటుంది. ఇష్టానుసారం వ్యవహారిస్తే చట్టం ఊరుకోదు. విచిత్రమైన మనస్తత్వం ఉన్నవాళ్లు అలా మాట్లాడుతారు. ఆయన చేసిన పనులను చూసి జనం ఆ తీర్పు ఇచ్చారు. జగన్‌కు సత్తెనపల్లి పర్యటన నిమిత్తం 3 కార్లు, 100 మంది జనానికి మాత్రమే ఏపీ పోలీసులు అనుమతి ఇచ్చారు. అంతకంటే ఎక్కువమంది ఎలా వెళ్తారు. మేం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాకు అనుమతులు ఇచ్చారా. 2029లో ఎన్నికలు ఉంటాయి.. ఇప్పుడు నీ వెంట వచ్చిన జనాన్ని చూసి మేము ఎందుకు భయపడతాం. అప్పటికీ నీ ఆటలు ఎలా సాగుతాయనేది చూస్తాం. మీ భవిష్యత్తును తీర్చిదిద్దే నాయకుడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రాష్ట్ర నాయకుడిని ఎన్నుకునేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి. ప్రజలు అడిగితే మేము సమాధానం చెబుతాం. కానీ మా నేతలను వైసీపీ శ్రేణులు నిలదీస్తే తాట తీస్తాను .. ఇందులో సందేహం లేదు. నీ వాహనాలు ఢీ కొట్టి ఒకరు చనిపోతే ఎందుకు పరామర్శించవు. బెట్టింగ్ ప్రాణానికి ఉన్న విలువ నీ వాహనం ఢీకొట్టి చనిపోయిన వారి ప్రాణానికి లేదా. నన్ను, వైజాగ్, తిరుపతిలో ఆపితే నేను దౌర్జన్యం చేశానా. 40 వేల మందిని పొదిలిలో ఎందుకు పోగేశావ్. నువ్వు పొగాకు వేలం కేంద్రానికి 40 వేల మందిని ఎలా తీసుకెళ్తావు. కుప్పంలో జరిగిన సంఘటనకు నేను సిగ్గు పడుతున్నాను. శాంతి భద్రతలు ప్రభుత్వానికి చాలా ముఖ్యం. చంపడం కూడా సినిమాల్లో చూపిస్తారు... వాటిని చూసి నేను బయట చంపుతానంటే ఎలా అని’ సీఎం చంద్రబాబు ప్రశ్నించారు.

ఈ వార్తలు కూడా చదవండి

నెల్లూరు రైల్వే కోర్టుకు మాజీ మంత్రి

జగన్ వ్యాఖ్యలపై నవ్వుకుంటున్నారు.. పట్టాభి సెటైర్

జగన్ పల్నాడు పర్యటనపై షర్మిల సంచలన కామెంట్స్

Read latest AP News And Telugu News

Updated Date - Jun 19 , 2025 | 05:54 PM