Kakani Govardhan: నెల్లూరు రైల్వే కోర్టుకు మాజీ మంత్రి
ABN , Publish Date - Jun 19 , 2025 | 03:44 PM
Kakani Govardhan: అనధికార టోల్‌గేట్ ఏర్పాటుపై ముత్తుకూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అవగా.. ఏ1గా కాకాణి ఉన్నారు. అలాగే మరో పది మంది అనుచరులపై కూడా కేసు నమోదు అయింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నెల్లూరు, జూన్ 19: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని (Former Minister Kakani Goverdhan Reddy) ఈరోజు (గురువారం) నెల్లూరు రైల్వే కోర్టులో పోలీసులు హాజరుపర్చారు. ముత్తుకూరు సమీపంలో అనధికార టోల్ గేట్ల ఏర్పాటు కేసులో కాకాణి ఏ1 ముద్దాయిగా ఉన్నారు. ఈ కేసులోని కాకాణని పోలీసులు కోర్టులో హాజరుపర్చగా.. వాదనలు కొనసాగుతున్నాయి. అయితే గత ప్రభుత్వ హయాంలో తన నియోజకవర్గంలో కృష్ణపట్నం పోర్టుకు వెళ్లే మార్గంలో టోల్‌గేట్‌ను ఏర్పాటు చేసి కోట్ల రూపాయలను కాకాణి వసూలు చేసినట్లు పోలీసుల విచారణలో బయటపడింది. ఒక్కో వాహనం నుంచి రూ. 10 వేల నుంచి రూ.20 వేల వరకు వసూలు చేశారని విచారణలో తేలింది.
దీనిపై ముత్తుకూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అవగా.. ఏ1గా కాకాణి ఉన్నారు. అలాగే మరో పది మంది అనుచరులపై కూడా కేసు నమోదు అయింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాకాణిని పీటీ వారెంట్‌పై రైల్వే కోర్టులో హాజరుపర్చగా.. విచారణ అనంతరం ఆయనను తిరిగి సెంట్రల్ జైలుకు పోలీసులు తరలించనున్నారు. కాగా.. మాజీ మంత్రి ఇప్పటికే మూడు కేసుల్లో నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. క్వార్ట్జ్ అక్రమ తవ్వకం, రవాణా.. అక్రమ గ్రావెల్ తవ్వకాలు, ఫొటోల మార్ఫింగ్ తదితర కేసుల్లో నిందితుడిగా ఉన్న కాకాణి.. నెల్లూరు సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
మరోవైపు సర్వేపల్లి రిజర్వాయర్‌లో గ్రావెల్ అక్రమ తవ్వకాలు, అనుమతుల కోసం అక్రమ మార్గాలు అనుసరించడం, ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి సంతకం ఫోర్జరీ తదితర ఆరోపణలపై నమోదైన కేసులో ఏ2గా ఉన్న కాకాణికి కోర్టు రిమాండ్ విధించింది. ఈ వ్యవహారంపై వెంకటాచలం పోలీసుస్టేషన్‌లో 2021 జూన్ 21న నమోదైన కేసు ఆధారంగా ఈ ఏడాది ఫిబ్రవరి 15న సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏ1గా నిరంజన్‌రెడ్డి ఉండగా, ఏ2గా కాకాణి గోవర్ధరెడ్డి పేరు నమోదు చేశారు. అంతే కాకుండా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారంటూ కాకాణిపై కేసు నమోదు అయ్యింది.
ఇక క్వార్ట్జ్ అక్రమాలు, భారీ పేలుళ్ల పదార్థాల వినియోగం, అట్రాసిటీ కేసులోనూ కాకాణి ఏ4 నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో కాకాణికి కోర్టు రిమాండ్ విధించడంతో ఆయన నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి పలుమార్లు కాకాణికి నోటీసులు ఇచ్చినప్పటికీ స్పందించకపోగా పోలీసుల నుంచి తప్పించుకుని తిరిగారు. ఎట్టకేలకు బెంగళూరులో కాకాణిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. నెల్లూరు తీసుకువచ్చి వెంకటగిరి కోర్టులో హాజరుపర్చగా.. ఆయనకు న్యాయస్థానం రిమాండ్ విధించింది.
ఇవి కూడా చదవండి
జగన్ వ్యాఖ్యలపై నవ్వుకుంటున్నారు.. పట్టాభి సెటైర్
జగన్ పల్నాడు పర్యటనపై షర్మిల సంచలన కామెంట్స్
బ్రిటన్ మాజీ ప్రధానితో లోకేష్ భేటీ.. చర్చించిన అంశాలివే
Read latest AP News And Telugu News