Share News

Lokesh Meets Tony Blair: బ్రిటన్ మాజీ ప్రధానితో లోకేష్ భేటీ.. చర్చించిన అంశాలివే

ABN , Publish Date - Jun 19 , 2025 | 11:51 AM

Lokesh Meets Tony Blair: ఏపీ విద్యా శాఖ, టీబీఐ మధ్య ఒప్పందం తర్వాత ఏ మేరకు పురోగతి సాధించారనే అంశంపై ఇద్దరు నేతలు సుదీర్ఘంగా సమీక్షించారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న నైపుణ్యాభివృద్ధి ఎజెండా, స్కిల్ సెన్సస్, దేశం వెలుపల యువతకు ఉపాధి వంటి అంశాల్లో టీబీఐ సాంకేతిక మద్దతుపై ఈ సమావేశంలో చర్చించారు.

Lokesh Meets Tony Blair: బ్రిటన్ మాజీ ప్రధానితో లోకేష్ భేటీ.. చర్చించిన అంశాలివే
Lokesh Meets Tony Blair

న్యూఢిల్లీ, జూన్ 19: ఢిల్లీలో ఏపీ విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ (Minister Nara lokesh) రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. ఇందులో భాగంగా బ్రిటన్ మాజీ ప్రధాని, టోనీ బ్లెయిర్ ఇనిస్టిట్యూట్ ఫర్ గ్లోబల్ చేంజ్(టీబీఐ) వ్యవస్థాపకులు టోనీ బ్లేయిర్‌తో (Britain Former PM Tony Blair) మంత్రి సమావేశమయ్యారు. ప్రభుత్వ కార్యకలాపాలు, విద్యలో ఏఐ టూల్స్ వినియోగంపై ప్రధానంగా చర్చించారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న నైపుణ్యాభివృద్ధి ఎజెండా, స్కిల్ సెన్సస్, దేశం వెలుపల యువతకు ఉపాధి వంటి అంశాల్లో టీబీఐ సాంకేతిక మద్దతుపై ఈ సమావేశంలో చర్చించారు. నైపుణ్య శిక్షణ అంశాలు, గ్లోబల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ స్థాపనకు సహకారంపై ఒప్పందం కుదిరింది. అలాగే ఉన్నత విద్యలో సంస్కరణలు, సాంకేతిక మద్దతుపై సమీక్ష నిర్వహించారు.


ఈరోజు (గురువారం) న్యూఢిల్లీలోని తాజ్ ప్యాలెస్‌లో టోనీ బ్లెయిర్‌ను మంత్రి లోకేష్ కలుసుకుని పలు అంశాలపై చర్చించారు. గత ఏడాది జులై నెలలో బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌ను మంత్రి లోకేష్ ముంబైలో కలిశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యకలాపాలు, విద్యావ్యవస్థలో ఏఐ టూల్స్‌ను ఉపయోగించడానికి టోనీ బ్లెయిర్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ చేంజ్(టీబీఐ) ద్వారా సహకరించేందుకు టోనీ బ్లెయిర్ అంగీకరించారు. ఆ మేరకు విద్యారంగంలో అధునాతన సాంకేతికతను అమలు చేయడం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపర్చడానికి ఏపీ విద్యాశాఖ, టోనీ బ్లెయిర్ ఇనిస్టిట్యూట్ ఫర్ గ్లోబల్ చేంజ్ (టీబీఐ) మధ్య 2024 డిసెంబర్‌లో ఒప్పందం కుదిరింది.


ఈ ఒప్పందంలో భాగంగా టీబీఐ విజయవాడలో తమ ఎంబెడెడ్ బృందాన్ని మొహరించి రెండు ప్రధాన అంశాలపై దృష్టి సారించి అభివృద్ధి చేస్తోంది. అందులో ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యలో సంస్కరణలు, గ్లోబల్ ఇనిస్టిట్యూట్ ఫర్ గుడ్ గవర్నెన్స్ స్థాపన ప్రధానమైనవి. ఏపీ విద్యా శాఖ, టీబీఐ మధ్య ఒప్పందం తర్వాత ఏ మేరకు పురోగతి సాధించారనే అంశంపై ఇద్దరు నేతలు సుదీర్ఘంగా సమీక్షించారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న నైపుణ్యాభివృద్ధి ఎజెండా, స్కిల్ సెన్సస్, దేశం వెలుపల యువతకు ఉపాధి వంటి అంశాల్లో టీబీఐ సాంకేతిక మద్దతుపై ఈ సమావేశంలో చర్చించారు. గ్లోబల్ ఇనిస్టిట్యూట్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (GiGG) సలహాబోర్డులో చేరాల్సిందిగా టోనీ బ్లెయిర్‌ను మంత్రి లోకేష్ ఈ సందర్భంగా ఆహ్వానించారు.


నైపుణ్య శిక్షణ అంశాలు, గ్లోబల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ స్థాపనకు సహకారంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, టోనీ బ్లెయిర్ ఇన్స్టిట్యూట్ మధ్య ఒప్పందం కుదిరింది. ఆగస్టులో విశాఖపట్నంలో జరగబోయే రాష్ట్రాల విద్యా మంత్రుల కాంక్లేవ్‌కు టీబీఐ భాగస్వామిగా ఉంటుందని టోనీ బ్లెయిర్ అన్నారు. ఈ సమావేశంలో విద్య శాఖ కార్యదర్శి కోన శశిధర్, టోనీ బ్లెయిర్ ఇన్‌స్టిట్యూట్ ప్రతినిధులు పాల్గొన్నారు.


ఏపీని స్పోర్ట్స్‌ హబ్‌గా మార్చండి: లోకేష్

lokesh-mansuk.jpg
అంతకు ముందు కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాలు, కార్మిక, ఉపాధి శాఖల మంత్రి మన్సుఖ్ మాండవీయతో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించే స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి సహకారం అందించాలని కేంద్రమంత్రిని లోకేష్ కోరారు. ఆంధ్రప్రదేశ్‌ను స్పోర్ట్స్ హబ్‌గా మార్చడానికి సహకారం అందించాలన్నారు. రాష్ట్రంలోని పాఠశాలలు, గ్రామ స్థాయి నుంచి క్రీడల అభివృద్ధికి చేయూతను అందించాలని కోరారు. కేంద్ర క్రీడల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో తిరుపతిలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా రీజనల్ సెంటర్ ఏర్పాటు చేయాలని, రాష్ట్రంలోని 26 జిల్లాల్లో జిల్లాస్థాయి ఖేలో ఇండియా సెంటర్లను ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రికి మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు. ఇందుకు కేంద్రమంత్రి మాండవీయ స్పందిస్తూ... ఏపీని స్పోర్ట్స్ హబ్‌గా మార్చేందుకు పూర్తిస్థాయిలో సహకరిస్తామని..ఈఎస్ఐ హాస్పిటల్స్ సేవలను మరింత విస్తృత పరుస్తామని హామీ ఇచ్చారు.


ఇవి కూడా చదవండి

వివాదాస్పద ప్లకార్డులు.. వైసీపీ కార్యకర్త అరెస్ట్

ఓదార్పుకు కాదు.. యుద్ధానికి వెళ్లినట్టుంది.. జగన్‌పై కన్నా సెటైర్

అంబటిపై కేసు.. ఎందుకంటే..

Read latest AP News And Telugu News

Updated Date - Jun 19 , 2025 | 06:22 PM