ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Arimilli RadhaKrishna: మాజీ మంత్రి కారుమూరికి ఎమ్మెల్యే ఆరిమిల్లి మాస్ వార్నింగ్

ABN, Publish Date - Apr 18 , 2025 | 02:38 PM

Arimilli RadhaKrishna: మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావుపై తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తణుకు నియోజకవర్గానికి మాజీ మంత్రి కారుమూరి ఒక దరిద్రంగా తయారయ్యారని ధ్వజమెత్తారు.

Arimilli RadhaKrishna

పశ్చిమగోదావరి: మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావుపై తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ హాట్ కామెంట్స్ చేశారు. మాజీ మంత్రి కారుమూరి సిగ్గుందా.. తప్పుడు మాటలు మాట్లాడి తప్పుడు వ్యవహారాలు చేసే వ్యక్తివి అని విమర్శించారు. ఖబర్దార్ కారుమూరి నియోజకవర్గంలో తిరగకుండా చేస్తామని హెచ్చరించారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అధికార మదంతో కారుమూరి మాట్లాడిన మాటలు అన్ని మరిచిపోయి ఇప్పుడు ఏమీ తెలియనట్లుగా శుద్ధ పూసలా మాట్లాడుతున్నారని ఆరిమిల్లి రాధాకృష్ణ మండిపడ్డారు.


బుద్ధిలేని మనిషిలా తయారయ్యావ్ అని ఆరిమిల్లి రాధాకృష్ణ విమర్శించారు. తణుకు నియోజకవర్గానికి ఒక దరిద్రంగా తయారయ్యావ్ అని ధ్వజమెత్తారు. ప్రజలు కారుమూరి చేసిన తప్పుడు పనులు, ఆయన మాట్లాడిన తప్పుడు మాటలు అన్ని గమనించి ఓడించారని అన్నారు. కారుమూరి బుర్ర పెట్టి ఆలోచించి మాట్లాడటం నేర్చుకోవాలని హితవు పలికారు. ఈ నియోజకవర్గ ప్రజలు బాధలు తీర్చే విధంగా తాము కష్టపడి పని చేస్తామని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లండన్ మందులు వాడుతున్నారని ఆరోపించారు. ఇక్కడ మాజీ మంత్రి కారుమూరి ఆ మందులే వాడుతున్నారని సెటైర్లు గుప్పించారు. కారుమూరి నోటి దురద కంట్రోల్ చేసుకోకుండా మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఇవి కూడా చదవండి

Jagan Big Shock: జగన్‌కు భారీ ఎదురు దెబ్బ

Police Case: భూమన కరుణాకర్ రెడ్డిపై కేసు నమోదు

Cool Drink Incident: అసలేం తినేటట్టు లేదు.. తాగేట్టూ లేదుగా

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 18 , 2025 | 03:56 PM