ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Tirupati: ‘థ్యాంక్యూ సీఎం సర్‌, లోకేశ్‌ అన్న’ అంటూ...

ABN, Publish Date - Apr 22 , 2025 | 01:26 PM

గత ఆరేళ్లుగా ఎదురుచూస్తున్న కలను సీఎం నారా చంద్రబాబు నాయుడు సాకారం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం ఆరేళ్లుగా నోటిఫికేషన్ వెలువరించకపోవండంతో నిరుద్యోగుల్లో తీవ్ర నిరాశ ఎదురైంది. అయితే.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రభుత్వం 16,347 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేయడంతో నిరుద్యోగుల్లో హర్షం వ్యక్తం అవుతోంది.

- డీఎస్సీపై చంద్రబాబు, లోకేశ్‌ చిత్రపటాలకు క్షీరాభిషేకం

తిరుపతి: డీఎస్సీ అభ్యర్థుల ఆరేళ్ల కలను సీఎం నారా చంద్రబాబు నాయుడు(CM Nara Chandrababu Naidu), విద్యాశాఖా మంత్రి లోకేశ్‌ సాకారం చేశారని శాప్‌ చైర్మన్‌ అనిమిని రవినాయుడు అన్నారు. కూటమి ప్రభుత్వం డీఎస్సీని విడుదల చేసి ఇది మంచి ప్రభుత్వమని మరోసారి నిరూపించుకుందన్నారు. డీఎస్సీ విడుదల సందర్భంగా తిరుపతి ఆర్డీవో ఆఫీసు ఎదుట డీఎస్సీ అభ్యర్థులు, టీఎన్‌ఎస్ఎప్ నాయకులతో కలిసి సోమవారం చంద్రబాబు, లోకేశ్‌ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు.

ఈ వార్తను కూడా చదవండి: Minister: మా శాఖలో నిధుల్లేవు... నాకు అధికారం లేదు..


‘థ్యాంక్యూ సీఎం సర్‌, లోకేశ్‌ అన్న’ అంటూ డీఎస్సీ అభ్యర్థులు ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. రవినాయుడు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో డీఎస్సీ నోటిఫికేషన్‌ కోసం ఇదే ప్రాంతంలో నిరసనలు, ధర్నాలు చేపట్టామని, కనీసం పట్టించుకున్న దాఖలాలు లేవని అన్నారు. అన్ని కేటగిరీలకు న్యాయం జరిగేలా ప్రస్తుత ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చిందన్నారు.


టీఎన్‌ఎస్ఎఫ్ తిరుపతి పార్లమెంట్‌ అధ్యక్షుడు కొట్టే హేమంత్‌ రాయల్‌ మాట్లాడుతూ డీఎస్సీ విడుదల పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోందని, చెప్పినట్టుగానే 16,347 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేశారని అన్నారు. ఇప్పటికైనా మాజీ సీఎం జగన్‌ రెడ్జి బుద్ధి తెచ్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్‌ఎ్‌సఎ్‌ఫ నగర అధ్యక్షుడు వెంకటేష్‌ యాదవ్‌, రాష్ట్ర సభ్యులు ఆర్కే నాయుడు, విష్ణు, గణేష్‌ తదితరులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

Gold Price Record: బంగారం లకారం

గూగుల్ కీలక నిర్ణయం..ఆ కేసు పరిష్కారం కోసం రూ.20.24 కోట్లు చెల్లింపు

కేటీఆర్‌పై కేసులు కొట్టివేసిన హైకోర్టు

ACB: ఏసీబీ వలలో ఐదుగురు అధికారులు

నీట ఆటగాడు..

Read Latest Telangana News and National News

Updated Date - Apr 22 , 2025 | 01:26 PM