ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Tirumala: దివ్యదర్శనం టోకెన్ కౌంటర్లు ఎక్కడంటే..

ABN, Publish Date - Jun 04 , 2025 | 07:22 AM

Tirumala: శ్రీవారి దర్శనం కోసం మెట్ల మార్గంలో వచ్చే భక్తుల కోసం టీటీడీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. దివ్యదర్శనం టోకెన్ల కౌంటర్లను తాత్కాలికంగా అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్‌కు తరలించనున్నట్లు తెలిపారు. శ్రీవారి మెట్ల మార్గంలో తిరుమలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.

Tirumala

తిరుపతి: తిరుమల (Tirumala)లో భక్తుల (Devotees) రద్దీ కొనసాగుతోంది (Temple rush). వేసవి సెలవులు (Summer vacation) ముగుస్తున్న నేపథ్యంలో భక్తులు పెద్ద సంఖ్యలో స్వామి వారి దర్శనం కోసం తరలి వస్తున్నారు. ఈ క్రమంలో భక్తులతో కంపార్టుమెంట్లు అన్నీ నిండిపోయి క్యూలైన్లు వెలుపలకు వచ్చాయి. సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. దీంతో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మరోవైపు శ్రీవారి వారి దర్శనం కోసం మెట్ల మార్గంలో కాలినడకన వచ్చే భక్తుల కోసం టీటీడీ అధికారులు (TTD Officers) కీలక నిర్ణయం (Key decision) తీసుకున్నారు. ఇప్పటి వరకు జారీ చేస్తున్న దివ్యదర్శనం టోకెన్ల కౌంటర్లను (Token counters) తాత్కాలికంగా అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్‌ (Bhudevi Complex)కు తరలించనున్నట్లు తెలిపారు. ఈ కొత్త కౌంటర్లు ఈ నెల 6వ తేదీ సాయంత్రం నుంచి భక్తులకు అందుబాటులో ఉంటాయని అధికారులు పేర్కొన్నారు.


తాత్కాలిక మార్పు..

అయితే ఇది తాత్కాలిక మార్పు మాత్రమేనని టీటీడీ అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని స్పష్టం చేశారు. ఇదే విషయంపై టీటీడీ ఈవో శ్యామలరావు మంగళవారం వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ మేరకు అధికారులతో సమీక్ష జరిపి భక్తులకు ఎలాంటి అడ్డంకులు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచనలు చేశారు.


శ్రీవారి మెట్ల మార్గంలో తిరుమలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. జూన్ 6, శుక్రవారం సాయంత్రం నుంచి అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన కౌంటర్ల ద్వారా దివ్యదర్శనం టోకెన్లు జారీ ప్రారంభమవుతాయన్నారు. ఈ టోకెన్లు ‘ఫస్ట్ కమ్ ఫస్ట్ సెర్వ్’ పద్దతిలో ముందుగా వచ్చిన వారికి ముందు దివ్య దర్శనం టోకెన్ల జారీ ప్రక్రియ చేపట్టనుంది. భక్తులు తమ ఆధార్‌కార్డు చూపించి దివ్య దర్శనం టోకెన్లు పొందాలని అధికారులు సూచించారు. ఆ తర్వాత టోకెన్లను శ్రీవారి మెట్టులోని 1200వ మెట్టు దగ్గర స్కాన్ చేసుకోవాలని.. స్కానింగ్ తర్వాతే వారు శ్రీవారి దర్శనానికి అనుమతించబడతారన్నారు. అదనంగా సర్వదర్శనం టోకెన్లు కూడా భూదేవి కాంప్లెక్స్‌లోని కౌంటర్ల ద్వారానే అందుబాటులో ఉంటాయని టీటీడీ అధికారులు స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఇడుపులపాయలోనే జగన్‌ అక్రమ ఆస్తులు

ఆరు పాక్‌ ఫైటర్లను కూల్చాం

For More AP News and Telugu News

Updated Date - Jun 04 , 2025 | 07:36 AM