Share News

Operation Sindhur: ఆరు పాక్‌ ఫైటర్లను కూల్చాం

ABN , Publish Date - Jun 04 , 2025 | 05:58 AM

ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్‌ పాకిస్థాన్‌కు భారీ నష్టం చేకూర్చింది. ఆరు యుద్ధ విమానాలు, ఒక AWACS నిఘా విమానం, సీ-130 రవాణా విమానం, 30కి పైగా క్షిపణులు, మరియు అనేక డ్రోన్లను భారత వాయుసేన ధ్వంసం చేసింది.

Operation Sindhur: ఆరు పాక్‌ ఫైటర్లను కూల్చాం

ఒక సీ-130, 2 నిఘా విమానాలు కూడా..

30కిపైగా క్షిపణులు గాల్లోనే ధ్వంసం

పెద్ద సంఖ్యలో డ్రోన్ల కూల్చివేత

ఆపరేషన్‌ సిందూర్‌ డేటాపై రక్షణ శాఖ

ఇండియా టుడే కథనం

న్యూఢిల్లీ, జూన్‌ 3: ఆపరేషన్‌ సిందూర్‌లో పాకిస్థాన్‌కు గట్టి దెబ్బ తగిలిందని.. ఆరు యుద్ధ విమానాలు, రెండు నిఘా విమానాలతోపాటు ఒక సీ-130 రవాణా విమానాన్ని కూడా కోల్పోయిందని రక్షణ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు 30కిపైగా క్షిపణులను, పెద్ద సంఖ్యలో డ్రోన్లను కూడా భారత్‌ ధ్వంసం చేసిందని వివరిస్తున్నాయి. ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో నమోదైన రాడార్‌, నిఘా వ్యవస్థలు, గగనతల రక్షణ వ్యవస్థల డేటాను విశ్లేషించి ఈ నిర్ధారణకు వచ్చినట్టు తెలిసింది. రక్షణ శాఖలోని విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ.. ఇండియా టుడే సంస్థ ఈ మేరకు కథనాన్ని ప్రచురించింది. ఆ వివరాల మేరకు... ఆపరేషన్‌ సిందూర్‌ జరిగిన 4రోజుల్లో పాకిస్థాన్‌కు చెందిన ఆరు యుద్ధ విమానాలను మన వాయుసేన క్షిపణుల సాయంతో కూల్చివేసింది. ఇక సుమారు 300 కిలోమీటర్ల దూరంలోని ఒక అత్యంత విలువైన ఎలకా్ట్రనిక్‌ వార్‌ఫేర్‌ (ఈడబ్ల్యూ) విమానం లేదా అవాక్స్‌ నిఘా విమానాన్ని సుదర్శన్‌ క్షిపణి వ్యవస్థను ఉపయోగించి ధ్వంసం చేసింది. మరోవైపు పాక్‌లోని భొలారి ఎయిర్‌బే్‌సపై మన వాయుసేన చేసిన క్షిపణి దాడుల్లో... ఆ ఎయిర్‌బే్‌సలో నిలిపి ఉన్న స్వీడన్‌ తయారీ నిఘా విమానం ధ్వంసమైంది. ఈ ఎయిర్‌బే్‌సలోని హ్యాంగర్‌ (విమానాలను పార్క్‌ చేసే భారీ షెడ్‌) కూడా కుప్పకూలింది. అందులో కొన్ని యుద్ధ విమానాలు పార్క్‌ చేసి ఉన్నట్టు నిఘా వర్గాలకు సమాచారం ఉంది. మరో ఎయిర్‌బే్‌సలోని హ్యాంగర్‌పై రాఫెల్‌, సుఖోయ్‌ ఫైటర్లతో చేసిన దాడిలో.. చైనా తయారీ వింగ్‌ లూంగ్‌ డ్రోన్లు పెద్ద సంఖ్యలో ధ్వంసమయ్యాయి. ఇక పాకిస్థాన్‌లోని పంజాబ్‌ ప్రాంతంపై భారత్‌ చేసిన డ్రోన్‌ దాడుల్లో పాక్‌ కు చెందిన సీ-130 రవాణా విమానం కూలిపోయింది. కాగా, అంచనా వేసినదానికన్నా పాకిస్థాన్‌కు నష్టం ఎక్కువ జరిగినట్లు రక్షణ వర్గాలు భావిస్తున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

సీఎం చంద్రబాబుతో హీరో అక్కినేని నాగార్జున భేటీ

ఏపీ కేబినెట్ భేటీ.. ఎప్పుడంటే..

For Telangana News And Telugu news

Updated Date - Jun 04 , 2025 | 05:58 AM