Share News

ఇడుపులపాయలోనే జగన్‌ అక్రమ ఆస్తులు: యనమల

ABN , Publish Date - Jun 04 , 2025 | 05:36 AM

జగన్ అక్రమ ఆస్తులు ఇడుపులపాయ బంకర్లలో దాచిపెట్టారని యనమల రామకృష్ణుడు ఆరోపించారు. తునిలో టీడీపీ క్యాంప్‌లో మాట్లాడిన ఆయన, జగన్ అవినీతి, కుట్రలపై తీవ్ర విమర్శలు చేశారు.

ఇడుపులపాయలోనే జగన్‌ అక్రమ ఆస్తులు: యనమల

తుని రూరల్‌, జూన్‌ 3(ఆంధ్రజ్యోతి): మాజీ సీఎం జగన్‌ అక్రమ ఆస్తులను ఇడుపులపాయలోని బంకర్లలోనే దాచిపెట్టారని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ఆరోపించారు. కాకినాడ జిల్లా తుని మండలం తేటగుంట టీడీపీ క్యాంపు కార్యాలయంలో మంగళవారం మీడియాతో మాట్లాడారు. ‘వెన్నుపోటు దినం అంటూ జగన్‌ తన అవినీతి పత్రికను అడ్డుపెట్టుకుని ప్రభుత్వంపై విషం కక్కే ప్రయత్నం చేస్తున్నారు. జగన్‌ కుట్రలను కూటమి నేతలు తిప్పికొట్టాలి. వెన్నుపోటు పొడవటం జగన్‌కు వెన్నతో పెట్టితో విద్య. తల్లి, చెల్లిని రోడ్డుపైకి ఈడ్చాడు. బాబాయి వివేకా హత్యతో జగన్‌ నేర చరిత్ర ప్రజలందరికీ తెలిసిందే. పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డారు. పేదలకు కూటమి ప్రభుత్వం పక్కా ఇళ్లు నిర్మిస్తుంటే జగన్‌కు కడుపు మంట ఏంటి?’ అని యనమల నిలదీశారు.

Updated Date - Jun 04 , 2025 | 05:37 AM