ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Tirupati incident:తిరుపతిలో మరో దారుణం.. ఏకంగా ఐదుగురు కుటుంబ సభ్యులను..

ABN, Publish Date - Mar 29 , 2025 | 06:28 PM

Tirupati incident: తిరుపతిలో మరో దారుణం వెలుగుచూసింది. ఓ కుటుంబాన్ని కొంతమంది దుండగులు కిడ్నాప్ చేసి డబ్బులు అడిగారు. ఇవ్వకపోవడంతో బెదరింపులకు దిగారు. పోలీసులు కిడ్నిప్‌నకు గురైన వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Tirupati incident

తిరుపతి: తిరుపతిలో మరో దారుణం జరిగింది. ఐదుమంది కుటుంబ సభ్యులు కిడ్నాప్‌నకు గురయ్యారు. శుక్రవారం సాయంత్రం జీవకోన ప్రాంతంలో ఉన్న రాజేష్ కుటుంబ సభ్యులను కొంతమంది దుండగులు కిడ్నాప్ చేశారు. రాజేష్ కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేసి కోటి రూపాయలను దుండగులు డిమాండ్ చేశారు. చిత్తూరులో ఉన్న తమ బంధువుల దగ్గరికి వెళ్తే ఇస్తామని రాజేష్ చెప్పడంతో..వారిని దుండగులు తీసుకెళ్తుండగా ఐతే పల్లె వద్ద కారులో నుంచి బలవంతంగా రాజేష్ దూకేశాడు.


తీవ్ర గాయాలతో పడి ఉన్న వ్యక్తిని చూసిన స్థానికులు 100 కు ఫోన్ చేశారు. పోలీసులకు సమాచారం తెలియడంతో ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. తమ కుటుంబంలోని సభ్యులను కిడ్నాప్ చేశారని.. తాను తప్పించుకున్నానని రాజేష్ తెలిపారు. తనకు నీరసంగా ఉందని.. తానేం మాట్లాడలేనని ఆస్పత్రికి తరలించాలని పోలీసులతో బాధితుడు అన్నాడు. గాయపడిన రాజేష్‌ను 108 వాహనంలో తిరుపతి రుయా హస్పిటల్‌కు చంద్రగిరి పోలీసులు తరలించారు. చికిత్స పొందుతూ తమ అమ్మ భార్య పిల్లలను కాపాడాలని రాజేష్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ విషయం తెలుసుకున్న అలిపిరి పోలీసులు రంగంలోకి దిగి రాజేష్ కుటుంబ సభ్యులను వెతుకుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

AP News: కొలిక్కి రాని కొలికపూడి ఇష్యూ.. తిరువూరులో ఉత్కంఠ..

Good News To Youth: ఉద్యోగాల పండగ.. టీడీపీ ఆవిర్భావ వేడుకల్లో సీఎం గుడ్‌న్యూస్

CM Chandrababu: ప్రజా సేవకు పునరంకితం అవుతామని సంకల్పం చేస్తున్నా...

For More AP News and Telugu News

Updated Date - Mar 29 , 2025 | 06:32 PM