ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Simhachalam Incident: సింహాచలం ప్రమాద ఘటనకు కారణమిదే.. కమిటీ ఏం తేల్చిందంటే..

ABN, Publish Date - May 01 , 2025 | 07:30 PM

శాఖ జిల్లా సింహాచలంలోని సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో జరిగిన ప్రమాద ఘటనపై ఏపీ ప్రభుత్వం త్రిసభ్య విచారణ కమిటీ నియమించిన విషయం తెలిసిందే.

విశాఖపట్నం: విశాఖ జిల్లా సింహాచలంలోని సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో జరిగిన ప్రమాద ఘటనపై ఏపీ ప్రభుత్వం త్రిసభ్య విచారణ కమిటీ నియమించిన విషయం తెలిసిందే. మున్సిపల్ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌.సురేష్‌ కుమార్‌ అధ్యక్షతన, ఈగల్‌ విభాగాధిపతి ఐజీ ఆకే రవికృష్ణ, జలవనరులశాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ ఎం.వెంకటేశ్వరరావు సభ్యులుగా కమిషన్‌ను నియమించారు. గురువారం ప్రమాద ఘటనను మరోసారి పరిశీలించిన కమిటీ బృందం.. రీటైనింగ్ వాల్ కూలిపోవడంతో ప్రమాదం జరిగిందని తేల్చింది.


క్వాలిటీ నిర్మాణం కాకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు కనిపించిందని పేర్కొంది. ఉత్సవాల కోసం నిర్మాణాన్ని తాత్కాలిక పూర్తి చేశారన్నారు. గోడ నిర్మాణాన్ని ఈ నెల 16వ తేదీన ప్రారంభించి.. 26 వరకు చేపట్టినట్లు తెలిపారు. కాంట్రాక్టర్లు, ఇంజనీర్లతో పాటూ దేవాదాయ అధికారులను విచారించినట్లు మున్సిపల్ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌.సురేష్‌ కుమార్‌ తెలిపారు. అలాగే జిల్లా అధికారులతో కూడ మాట్లాడినట్లు చెప్పారు. పూర్తి వాస్తవాలను ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నట్లు తెలిపారు.


అయితే టెంపుల్ మాస్టర్ ప్లాన్ నిబంధనలకు అనుకూలంగా జరిగిందా లేదా అనేది నిర్ధారిస్తామని చెప్పారు. వైఫల్యాలు, లోపాలపై నెల రోజుల్లో సమగ్ర నివేదిక సమర్పిస్తామన్నారు. కాంట్రాక్టర్‌తో పాటు అనుమతి ఇచ్చిన అధికారులు ఎవరు...? ఇందులో వాళ్ల ప్రమేయం ఏ మేరకు ఉందనే అంశాలపై సమగ్ర విచారణ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. చందనోత్సవంలో జరిగిన ప్రమాద ఘటనలో మొత్తం ఏడుగురు భక్తులు మృతి చెందిన విషయం తెలిసిందే.


ఇవి కూడా చదవండి..

Raj Kasireddy: ఏపీ లిక్కర్ స్కాం.. రాజ్ కేసిరెడ్డికి ఎదురుదెబ్బ

Andhra Liquor Scam: లిక్కర్ స్కామ్.. ఎస్కేప్‌‌కు దిలీప్ యత్నం.. పట్టేసుకున్న సిట్

Chandrababu MSME Parks: రైతులను పారిశ్రామికవేత్తలను చేస్తాం.. పరిశ్రమలు పెట్టండి

Updated Date - May 01 , 2025 | 07:30 PM