Andhra Liquor Scam: లిక్కర్ స్కామ్.. ఎస్కేప్‌కు దిలీప్ యత్నం.. పట్టేసుకున్న సిట్
ABN , First Publish Date - 2025-05-01T16:08:44+05:30 IST
Andhra Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్‌లో మరో కీలక పరిణాం చోటు చేసుకుంది. రాజ్ కసిరెడ్డి పీఏ దిలీప్‌ను చెన్నై ఎయిర్‌పోర్టులో సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

అమరావతి, మే 1: వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో (AP Liquor Scam) మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక నిందితుడు రాజ్ కేసిరెడ్డి పీఎ పైలా దిలీప్ చెన్నై నుంచి విదేశాలకు పరారయ్యేందుకు ప్రయత్నించారు. దుబాయ్ పారిపోయేందుకు చెన్నై ఎయిర్ పోర్టుకు చేరుకున్న దిలీప్‌ను సిట్ అధికారులు పట్టుకున్నారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఎదుట హాజరుకావాలని ఇప్పటికే సిట్ బృందం నోటీసులు జారీ చేసింది. అయితే పోలీసుల ముందు హాజరుకాకుండానే దేశం విడిచి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు దిలీప్. డిజిటల్, ఫోన్ లోకేషన్ ద్వారా పీఏ కదలికలపై సిట్ బృందం నిఘా పెట్టింది. ఈ క్రమంలో దిలీప్‌ను చైన్నై ఎయిర్‌పోర్టులో ఉన్నట్లు గుర్తించారు.
వెంటనే విజయవాడ నుంచి చెన్నై ఎయిర్‌పోర్టుకు చేరుకున్న సిట్ అధికారులు దిలీప్‌ను అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ నుంచి చెన్నై వెళ్లిన సిట్ బృందం.. పీఏ దిలీప్‌ను అదుపులోకి తీసుకుని ఈరోజు రాత్రికి విజయవాడకు తీసుకువస్తున్నట్లు సమాచారం. కాగా.. మద్యం కుంభకోణానికి సంబంధించి రాజ్ కేసిరెడ్డి పీఏ వద్ద కీలక సమాచారం ఉన్నట్లు సిట్ బృందాలు భావిస్తున్నాయి.
Chandrababu MSME Parks: రైతులను పారిశ్రామికవేత్తలను చేస్తాం.. పరిశ్రమలు పెట్టండి
కమిషన్‌లు ఇచ్చే డిస్ట్లరీ యజమానులతో దిలీప్ కాంటాక్టులో ఉండేవాడని డిస్ట్లరీ యజమానులు సిట్ బృందానికి ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నారు. ఇతనితో పాటు రాజ్ కేసిరెడ్డి లిక్కర్ గ్యాంగ్ అంతా కూడా పీఏ చెబితేనే అక్కడి వెళ్లి కమిషన్లు వసూలు చేసే వారని విచారణలో తేలింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఉండే ఓ కార్యాలయానికి సొమ్ము మొత్తాన్ని చేర్చి ప్రతీ వారం లెక్కలు తేల్చి.. ప్రతీ నెల 50 నుంచి 60 కోట్లను ఆయా వ్యక్తులకు ఇచ్చే వారని సమాచారం. డిస్ట్లరీ యజమానులకు నేరుగా ఫోన్లు చేసి ఏపీ బేవరేజ్ కార్పొరేషన్ ఎంత ఇండెంట్ ఇచ్చారు... ఆ ఇండెంట్ నుంచి ఎంత కమిషన్ రావాలో దిలీప్ ఫోన్ చేసి చెబితేనే డిస్ట్లరీ యజమానులు కమిషన్ మొత్తాన్ని తీసుకొచ్చి ఇచ్చేవారని తేలింది.
రాజ్ కేసిరెడ్డి, డిస్ట్లరీలు ఇద్దరి మధ్య అనుసంధాన కర్తగా ఉన్న పైలా దిలీప్‌ను అదుపులోకి తీసుకుంటే కీలక సమాచారం బయటపడే అవకాశం ఉందని సిట్ అధికారులు భావిస్తున్నారు. ఎవరి ఆదేశాలు మేరకు డిస్ట్లరీ యజమానులకు ఫోన్లు చేశారనేది పీఏ ద్వారా తెలుసుకోవచ్చని సిట్ భావించింది. ఇప్పటి వరకు చేసిన విచారణలో భాగంగా ఈ మొత్తానికి అనుసంధాన కర్తగా పైలా దిలీప్ ఉన్నాడని తేలింది. ఈ క్రమంలో దిలీప్ కాల్ డేటాపై సిట్ సమాచారం సేకరించింది. దిలీప్ ఎక్కడుంటాడు.. అతని కదలికలపై నిఘా పెట్టి సిట్ అధికారులు.. మారు పేరుతో టికెట్ కొని చెన్నై నుంచి దుబాయ్ వెళ్లాలని ప్రయత్నించినట్లు గుర్తించింది. వెంటనే చెన్నై ఎయిర్‌పోర్టుకు చేరుకుని దిలీప్‌ను అదుపులోకి తీసుకున్నారు.
ఇవి కూడా చదవండి
ACB Custody: విడుదల గోపిపై ఏసీబీ ప్రశ్నల వర్షం
PM Modi AP Visit: ప్రధాని మోదీ ఏపీ పర్యటన షెడ్యూల్ ఖరారు
Read Latest AP News And Telugu News