Kodali nani: కోల్‌కతాలో కొడాలి నానిని అడ్డుకున్న అధికారులు.. ఏపీ పోలీసుల రియాక్షన్
ABN, Publish Date - Jun 18 , 2025 | 02:02 PM
మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నానిని కోల్‌కతా ఎయిర్ పోర్ట్‌లో అడ్డుకున్నారంటూ జరుగుతోన్న ప్రచారంపై ఏపీ పోలీసులు స్పందించారు.
అమరావతి, జూన్ 18: కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నానిని అధికారులు అడ్డుకున్నారంటూ సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్న వార్తా కథనాలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు దృష్టి సారించారు. అందులోభాగంగా వారు దర్యాప్తు చేపట్టారు. అయితే కొడాలి నాని హైదరాబాద్‌లోనే ఉన్నట్లు ఏపీ పోలీసులు ధృవీకరించారు. కొడాలి నాని కొలంబో వెళ్తుండగా ఆయన్ని కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో అరెస్ట్ చేసినట్లు వార్తలు వెలువడ్డాయి. దీంతో ఏపీ పోలీస్ ఉన్నతాధికారులు.. కోల్‌కతా ఎయిర్‌పోర్ట్ అధికారులతో ఈ వ్యవహారంపై మాట్లాడారు. తాము ఎవరిని అడ్డుకోలేదని వారు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఈ వార్తా కథనాలు వైరల్ కావడం వెనుక ఎవరున్నారనే కోణంలో పోలీసులు.. తమ దర్యాప్తును ముమ్మరం చేశారు. ఉద్రిక్తతలు రెచ్చగొట్టేందుకే ఈ వార్తలు సృష్టించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
చెవిరెడ్డి భాస్కరరెడ్డి అరెస్ట్..
మరోవైపు వైసీపీ నేత, మాజీ మంత్రి చెవిరెడ్డి భాస్కరరెడ్డితోపాటు ఆయన స్నేహితుడు మద్యం కుంభకోణంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆ క్రమంలో వారిద్దరు బెంగళూరు ఎయిర్‌పోర్టు నుంచి శ్రీలంక వెళ్లిపోతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో వారిని ఎయిర్ పోర్ట్‌లో అరెస్ట్ చేసి.. ఏపీకి తరలించిన సంగతి తెలిసిందే.
రెంటపాళ్లలో జగన్ పర్యటన..
ఇంకోవైపు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ బుధవారం గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని రెంటపాళ్లలో పర్యటిస్తున్నారు. అందుకోసం ఆయన భారీ కాన్వాయ్‌తో తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయలుదేరారు. అయితే జగన్ పర్యటన నేపథ్యంలో ఆ ప్రాంతంలో పోలీసులు పలు ఆంక్షలు విధించారు. గతంలో వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న ఘటనల నేపథ్యంలో పోలీసులు ఈ చర్యలు చేపట్టారు. అదీకాక అంతర్జాతీయ యోగా దినోత్సవం మరికొద్ది రోజుల్లో జరగనుంది. అలాంటి వేళ.. ఈ పర్యటనలో గలాటాకు వైసీపీ నేతలు కుట్రకు తెర తీశారంటూ నిఘా వర్గాలకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో రెంటపాళ్లలో భద్రతను కట్టుదిట్టం చేశారు.
ఇవి కూడా చదవండి:
జగన్ పర్యటనలో అపశృతి.. ఒకరు మృతి
ప్రియుడితో వెళ్లిపోయిన భార్య.. సంబరం చేసుకున్న భర్త
For More AndhraPradesh News and Telugu News
Updated Date - Jun 18 , 2025 | 03:38 PM