Honeymoon Twist: ప్రియుడితో వెళ్లిపోయిన భార్య.. సంబరం చేసుకున్న భర్త
ABN , Publish Date - Jun 18 , 2025 | 11:04 AM
భార్యతో హనీమూన్ వెళ్దామని ప్లాన్ చేసుకున్నాడు. ఇంతలో భార్య ప్రియుడితో వెళ్లిపోయింది. దీంతో ఆ భర్త ఏ మాత్రం బాధపడకుండా.. సంబరాలు చేసుకున్నాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది.
న్యూఢిల్లీ, జూన్ 18: ప్రియుడి మోజులో పడి తాళి కట్టిన భర్తను అంతమొందించిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో చోటు చేసుకుంది. పెళ్లయి పట్టుమని పది రోజుల కూడా కాకుండానే హనీమూన్‌కు తీసుకు వెళ్లి.. ప్రియుడితో కలిసి భర్తను నిర్దాక్షణ్యంగా చంపి.. లోయలో పడేయించింది. ఈ ఘటన మేఘాలయాలో చోటు చేసుకుంది. వరుసగా ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అలాంటి వేళ.. అగ్ని సాక్షిగా తాళ్లికట్టిన భార్య ప్రియుడితో వెళ్లి పోతే.. హమ్మయ్య.. నేను బతికిపోయానంటూ ఆ భర్త సంబరాలు చేసుకున్నారు.
ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బదాయూ జిల్లాలో ఇటీవల చోటు చేసుకుంది. మే 17వ తేదీన సునీల్‌కు యువతితో వివాహమైంది. తొమ్మిది రోజుల తర్వాత నవ వధువు పుట్టింటికి వెళ్లింది. అటు నుంచి అటే ఆమె తన ప్రియుడితో వెళ్లిపోయింది. అయితే సునీల్‌కు ఈ విషయం తెలియక.. తన భార్య కనిపించడం లేదంటూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఆమె కోసం పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న ఆ యువతి.. తన ప్రియుడితో కలిసి పోలీసుల ముందు ప్రత్యక్షమైంది. తనకు భర్త వద్దని.. తన ప్రియుడే తన లోకమంటూ పోలీసులకు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఆమె ఇష్టాన్ని తాళి కట్టిన భర్త అంగీకరించారు.
దీంతో భర్త ఒక రేంజ్‌లో సంబరం చేసుకున్నాడు. తనను భార్య హత్య చేయలేదని తెలిపారు. ఆమె తన మానాన తాను వెళ్లిపోయిందని సంతోషం వ్యక్తం చేశాడు. తనను హత్య చేయకుండా ఆమె వెళ్లిపోవడంతో తాను బతికి పోయాయన్నాడు. ఇంకా నయం తాను నైనిటాల్‌లో హానీమూన్‌కు ప్లాన్ చేశానని.. కానీ ఇంతలోనే ఆమె వెళ్లిపోయిందని.. లేకుంటే తాను సైతం మరో రఘువంశీ పరిస్థితి తనకు వచ్చేదన్నాడు.
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన రఘువంశీకి ఇటీవల వివాహమైంది. అతను తన భార్యతో కలిసి హనీమూన్‌కు మేఘాలయాకు వెళ్లారు. అక్కడ పథకం ప్రకారం.. ప్రియుడితో కలసి భర్తను దారుణంగా హత్య చేసింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే తాను సైతం హనీమూన్‌కు వెళ్లితే.. తన పరిస్థితి సైతం రఘువంశీ పరిస్థితి వచ్చేదంటూ సునీల్ భయాందోళన వ్యక్తం చేశారు. మరోవైపు సునీల్, అతడి భార్య ఓ నిర్ణయానికి వచ్చి.. పెళ్లి సమయంలో ఇచ్చిన బంగారం, నగదు ఎవరికి వారు తీసుకున్నారు. ఈ వ్యవహరంపై పోలీసులు స్పందించారు. ఇరువురు ఒక నిర్ణయానికి రావడంతో.. ఈ కేసును క్లోజ్ చేశామని స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి:
ట్రంప్‌కు ఝలక్ ఇచ్చిన ప్రధాని మోదీ
యోగా డే ముందు రచ్చకు వైసీపీ బిగ్ ప్లాన్
For More National News and Telugu News