Share News

Jagan Tour: జగన్ పర్యటనలో అపశృతి.. ఒకరు మృతి

ABN , Publish Date - Jun 18 , 2025 | 12:29 PM

మాజీ సీఎం వైఎస్ జగన్ గుంటూరు జిల్లా పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్ ఢీ కొని ఓ వృద్ధుడు మరణించారు.

Jagan Tour: జగన్ పర్యటనలో అపశృతి.. ఒకరు మృతి
YCP Chief YS Jagan

గుంటూరు, జూన్ 18: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ గుంటూరు జిల్లా పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. బుధవారం ఉదయం ఏటూకురులో వైఎస్ జగన్ ప్రయాణిస్తున్న కాన్వాయ్.. ఒక వృద్ధుడిని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆయన తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందాడు.


ఇంతకీ ఏం జరిగిందంటే.. ?

బుధవారం సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో వైఎస్ జగన్ పర్యటించనున్నారు. అందుకోసం ఆయన భారీ కాన్వాయ్‌తో రెంటపాళ్లకు తాడేపల్లి ప్యాలెస్‌ నుంచి బయలుదేరారు. ఆ క్రమంలో జాతీయ రహదారిపై ఏటూకురు బైపాస్ వద్ద నడుచుకుంటూ వెళ్తున్న ఒక వృద్ధుడిని ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్థానికులు స్పందించి.. 108కి సమాచారం అందించారు. దీంతో వారు ఆయన్ని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అతడు మరణించారు. అయితే కాన్వాయ్ ఢీకొని గాయపడిన వృద్ధుడిని పట్టించుకోకుండా వైఎస్ జగన్‌తోపాటు వైసీపీ నాయకులు పట్టించుకోకుండా వెళ్లిపోయారు. దీంతో ఆ పార్టీ అధినేత వ్యవహార శైలిపై విమర్శలు వెల్లువెత్తుతోన్నాయి.


రెంటపాళ్లకు వైఎస్ జగన్ ఎందుకు..?

పోలీసుల వేధింపుల కారణంగా.. వైసీపీ నేత, రెంటపాళ్ల ఉప సర్పంచ్ కొర్లకుంట నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించనున్నారు. అనంతరం నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని వైఎస్ జగన్ ఆవిష్కరించనున్నారు.


యోగా దినోత్సవానికి ముందు కుట్ర..

అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ముందు వైసీపీ భారీ కుట్రకు తెర తీసినట్లు నిఘా వర్గాల ద్వారా ప్రభుత్వానికి సమాచారం అందింది. గుంటూరు జిల్లాలోని రెంటపాళ్ల పర్యటన సందర్భంగా గలాటా సృష్టించేందుకు వైసీపీ శ్రేణులు కుట్రలు చేసినట్లు తెలుస్తోంది. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. అందులోభాగంగా భారీగా పోలీసులు రంగంలోకి దింపింది. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టింది.

ఇవి కూడా చదవండి:

124 మృతదేహాలు కుటుంబ సభ్యులకు అప్పగింత..

ప్రియుడితో వెళ్లిపోయిన భార్య.. సంబరం చేసుకున్న భర్త

For More AndhraPradesh News and Telugu News

Updated Date - Jun 18 , 2025 | 12:48 PM