ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Minister Nara Lokesh: రాష్ట్రంలో ఉన్మాదులు, సైకోలకు తావులేదు..

ABN, Publish Date - Jun 09 , 2025 | 08:21 AM

Minister Nara Lokesh: అనంతపురం నగరానికి చెందిన ఇంటర్‌ విద్యార్థిని దారుణ హత్య తనను షాక్‌కు గురిచేసిందని మంత్రి నారా లోకేష్ అన్నారు. రాష్ట్రంలో ఉన్మాదులు, సైకోలకు తావులేదని, వారిని కఠినంగా శిక్షిస్తామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.

Minister Nara Lokesh

అమరావతి: అనంతపురం ( Anantapuram) రామకృష్ణ కాలనీకి చెందిన ఇంటర్ విద్యార్థిని (Inter Student) తన్మయి (Tanmai) హత్య (Murder) ఘటన తనను తీవ్రంగా కలచి వేసిందని రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) అన్నారు. దుండగులు రాక్షస ప్రవృత్తితో మృతదేహాన్ని పెట్రోల్ పోసి తగులబెట్టడం తనను షాక్‌కు గురిచేసిందన్నారు. కూటమి ప్రభుత్వంలో ఉన్మాదులు, సైకోలకు తావులేదని, ఇంటర్ విద్యార్థిని తన్మయి హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షిస్తామని మంత్రి స్పష్టం చేశారు. హత్యకు గురైన సోదరి కుటుంబానికి అన్నివిధాలా అండగా నిలుస్తామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు.

కాగా అనంతపురం నగరానికి చెందిన ఇంటర్‌ విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. స్థానిక రామకృష్ణ కాలనీకి చెందిన లక్ష్మీపతి కుమార్తె తన్మయి(19) నగరంలోని వివేకానంద కళాశాలలో ఇంటర్‌ సెకండియర్‌ చదివింది. సెలవులు కావడంతో ఇంటి వద్దే ఉంటోంది. ఈ నెల 3వ తేదీ (మంగళవారం) రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. తల్లిదండ్రులు పరిసర ప్రాంతాల్లో గాలించినా జాడ తెలియలేదు. దీంతో మరుసటి రోజు (బుధవారం) వన్‌టౌన్‌ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ నెల 7న కూడేరు మండలం గొట్కూరు సమీపంలో అనంతపురం-బళ్లారి ప్రధాన రహదారి పక్కన గుర్తుతెలియని శవం ఉందని పశువుల కాపరులు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించి.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. తన్మయి తల్లిదండ్రులు.. అక్కడికి చేరుకుని, మృతదేహం తమ కుమార్తెదేనని గుర్తించారు. కాగా యాసిడ్‌ వంటి ప్రమాదకర ద్రావణాన్ని ఆమెపై పోసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

గుర్తించలేని విధంగా ముఖం పూర్తిగా కాలి, ఉబ్బిపోయి ఉండడంతోపాటు శరీరంపై కాలిన గుర్తులతోపాటు పలు చోట్ల బొబ్బలు ఉన్నాయి. దీంతో ఆమెను ఉద్దేశ పూర్వకంగానే దారుణంగా హింసించి చంపి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. తమ కుమార్తె మృతిపై అనుమానాలు ఉన్నాయని, బాలు అనే యువకుడు గతంలో వేధించాడని తల్లిదండ్రులు మీడియాకు తెలిపారు. ఈ విషయాన్ని పోలీసులకు చెప్పినా పట్టించుకోలేదన్నారు. తన్మయి రాయదుర్గానికి చెందిన బాలు, అనంతపురం ఐదో రోడ్డులో ఉంటున్న నరేశ్‌, ఫెర్రర్‌నగర్‌కు దినేశ్‌తో స్నేహంగా ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు నరేశ్‌, బాలు అనే యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దినేశ్‌ కోసం గాలిస్తున్నారు. సీసీ టీవీ ఫుటేజీలు, ఫోన్‌ కాల్‌ లిస్ట్‌ ఆధారంగా విచారణ చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి:

ఏఐసీసీ పెద్దలను కలవనున్న సీఎం రేవంత్ రెడ్డి ఎందుకంటే..

హమీల అమలుకు బాబు సర్కార్ వ్యూహరచన

For More AP News and Telugu News

Read Latest and Crime News

Updated Date - Jun 09 , 2025 | 08:21 AM