ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Covid 19 Positive: గుంటూరులో రెండు కొవిడ్‌ కేసులు

ABN, Publish Date - Jun 03 , 2025 | 06:27 AM

గుంటూరు నగరంలో రెండు కొత్త COVID-19 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. బాధితులను ఆస్పత్రిలో చేర్చుకొని వైద్య చికిత్స అందిస్తున్నారు, అలాగే ప్రత్యేక ఓపీ మరియు ఐసోలేషన్‌ వార్డులను ఏర్పాటు చేశారు.

గుంటూరు మెడికల్‌, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): గుంటూరు నగరంలో సోమవారం రెండు కొవిడ్‌-19 పాజిటివ్‌ కేసులు నమోదైనట్టు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ కే విజయలక్ష్మీ వెల్లడించారు. జిల్లాలో ఇప్పటి వరకు తెనాలి, ఉండవల్లి ప్రాంతాల్లో కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, తాజాగా గుంటూరు నగర పరిధిలో కేసులు వెలుగుచూశాయి. బాధితులను ఆస్పత్రిలో చేర్చుకొని వైద్యచికిత్స అందిస్తున్నారు. కొవిడ్‌ అనుమానిత లక్షణాలతో వచ్చే వారికి వైద్య పరీక్షలు నిర్వహించేందుకు గుంటూరు ప్రభుత్వాస్పత్రి క్యాజువాలిటీ సమీపంలో ప్రత్యేక ఓపీ ఏర్పాటు చేశారు. రోజుకి కనీసం వంద మందికి పరీక్షలు చేసే విధంగా ఏర్పాట్లు చేశారు. కరోనా రోగులకు చికిత్స నిమిత్తం బీ క్లాస్‌ వార్డులో 15 పడకలతో ఐసోలేషన్‌ వార్డును ఏర్పాటు చేశారు. ఇక్కడ వెంటిలేటర్లతో పాటు ఆక్సిజన్‌ను కూడా సిద్ధం చేశారు.

Updated Date - Jun 03 , 2025 | 06:28 AM