Lok Sabha Elections 2024: రేవంత్‌ని కోర్టుకు ఈడుస్తాం.. కిషన్‌రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
ABN, Publish Date - Apr 29 , 2024 | 08:34 PM
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి (CM Revanth Reddy) సోమవారం ఢిల్లీ పోలీసులు (Delhi police) సమన్లు జారీ చేశారు. కేంద్రమంత్రి అమిత్ షా (Amit Shah) డీప్ ఫేక్ వీడియో (Deep fake Video) కేసులో భాగంగా సీఎం రేవంత్‌కు సమన్లు జారీ అయ్యాయి. అయితే నోటీసులపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. అమిత్ షా ఆడియో మార్పింగ్ దేశ భద్రతకు సంబంధించిన అంశమని చెప్పారు.
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి (CM Revanth Reddy) సోమవారం ఢిల్లీ పోలీసులు (Delhi police) సమన్లు జారీ చేశారు. కేంద్రమంత్రి అమిత్ షా (Amit Shah) డీప్ ఫేక్ వీడియో (Deep fake Video) కేసులో భాగంగా సీఎం రేవంత్‌కు సమన్లు జారీ అయ్యాయి. అయితే నోటీసులపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. అమిత్ షా ఆడియో మార్పింగ్ దేశ భద్రతకు సంబంధించిన అంశమని చెప్పారు.
CM Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల సమన్లు
రిజర్వేషన్లపై సీఎం రేవంత్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రేవంత్‌ని కోర్టుకు ఈడుస్తామని కిషన్ రెడ్డి హెచ్చరించారు. అమిత్ షా పై ఫేక్ ఆడియో.. కాంగ్రెస్ పార్టీలో అనిశ్చితిని తెలియజేస్తోందన్నారు.దేశ హోంమంత్రి ఆడియోను మార్పింగ్ చేయటాన్ని కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుందని వివరించారు. రేవంత్‌ని ప్రజలు జోకర్ కింద చూస్తున్నారని విమర్శించారు.రేవంత్ మాటలతో శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశముందని చెప్పారు. రిజర్వేషన్లు తీసివేసేది లేదని ఆర్ఎస్ఎస్ చీఫ్ కూడా చెప్పారని అన్నారు. ముఖ్యమంత్రి స్థాయిని రేవంత్ రెడ్డి దిగజార్చుతున్నారని మండిపడ్డారు. రిజర్వేషన్ల ఆరోపణలతో రేవంత్ విశ్వనీయత కోల్పోయారని చెప్పుకొచ్చారు.
Bandi Sanjay: నువ్వొక డ్రామా ఆర్టిస్ట్.. నీ అయ్య లేకుంటే నీ బతుకేంది?
సీఎంగా రేవంత్.. ప్రతిపక్షనేతగా కేసీఆర్ ఉండటం తెలంగాణ ప్రజల కర్మ అని ఆక్షేపించారు. కృష్ణా జలాల వాటాల్లో 299టీఎంసీలకు సంతకం పెట్టిందే కేసీఆర్ అని గుర్తుచేశారు. కేసీఆర్ మాటలకు విలువ లేదని.. స్పందించాల్సిన అవసరం లేదన్నారు. కేసీఆర్ కేంద్రంలో చక్రం తిప్పటం కాదని.. ఆయన కూతురు కవిత బీరు , బ్రాందీ కేసులో చక్రం తిప్పిందని సెటైర్లు గుప్పించారు. సొంత ఎమ్మెల్యేలను కాపాడుకోలేని కేసీఆర్.. ఢిల్లీలో చక్రం తిప్పుతాననటం కామెడీగా ఉందని ఎద్దేవా చేశారు. రేవంత్, కేసీఆర్ పోటీ పడి మరీ... ఓవైసీ సంక నాకుతున్నారని దెప్పిపొడిచారు.ఎంఐఎం గెలుపు కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ కలసి పనిచేస్తున్నాయని చెప్పారు. చాలా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ సైలెంట్‌గా ఉందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.
బీజేపీలో చేరిన ఎంపీ వెంకటేష్ నేత, పెద్దిరెడ్డి
పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత, మాజీమంత్రి ఇ.పెద్దిరెడ్డి కిషన్‌రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. వీరిని పార్టీలోకి కిషన్‌రెడ్డి ఆహ్వానించారు. ఈ నేతలతో పాటు మరికొంతమంది నేతలు కూడా సోమవారం కమలం పార్టీలో చేరారు. అయితే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోరంగా ఓడిపోవడం.. ఆ తర్వాత పరిణామాలతో ఎంపీ వెంకటేష్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్‌లో చేరే సమయంలో ఆయనకు పెద్దపల్లి ఎంపీ టికెట్ ఇస్తారని ఏఐసీసీ కేంద్ర నేతలు, సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చినట్లు సమాచారం. అయితే పెద్దపల్లి ఎంపీ టికెట్ ఇవ్వకపోవడంతో వెంకటేష్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అందువల్లే ఆయన బీజేపీలో చేరినట్లు తెలుస్తోంది. వెంకటేష్ బీజేపీలో చేరడంతో కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు పెద్దపల్లిలో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
Kingfisher Beer: కింగ్‌ఫిషర్ బీర్లు దొరకట్లేదు.. ఆదుకోండి మహాప్రభో!!
Ponnala Laxmaiah: 1.85 శాతం ఓట్లతో ఓడిపోయిన బీఆర్‌ఎస్ చచ్చిన పాము ఎలా అవుతుంది?
Read Latest Election News or Telugu News
Updated Date - Apr 29 , 2024 | 08:48 PM