Share News

Bandi Sanjay: నువ్వొక డ్రామా ఆర్టిస్ట్.. నీ అయ్య లేకుంటే నీ బతుకేంది?

ABN , Publish Date - Apr 29 , 2024 | 01:34 PM

తెలంగాణలో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ రాజుకుంటోంది. ఇరు పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ ఒక డ్రామా ఆర్టిస్ట్ అని.. ఆయనకు ఒకప్పుడు వేసుకునేందుకు బట్టలు కూడా ఉండేవి కావని ఎద్దేవా చేశారు. తనను గాలి తిరుగుడు అనడంపై బండి సంజయ్ మండిపడ్డారు

Bandi Sanjay: నువ్వొక డ్రామా ఆర్టిస్ట్.. నీ అయ్య లేకుంటే నీ బతుకేంది?

కరీంనగర్: తెలంగాణలో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ రాజుకుంటోంది. ఇరు పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ (Bandi Sanjay) కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ ఒక డ్రామా ఆర్టిస్ట్ అని.. ఆయనకు ఒకప్పుడు వేసుకునేందుకు బట్టలు కూడా ఉండేవి కావని ఎద్దేవా చేశారు. తనను గాలి తిరుగుడు అనడంపై బండి సంజయ్ మండిపడ్డారు. ‘నీ అయ్య లేకపోతే నీ బతుకు ఏంది?’ అని కేటీఆర్‌ను నిలదీశారు. తాను జనం కోసం పోరాడానని.. కేటీఆర్ అమెరికాలో చిప్పలు కడిగాడని విమర్శించారు. ఎన్నికలు వస్తేనే కేంద్ర పాలిత ప్రాంతం గుర్తుకు వస్తుందన్నారు. ‘నీ అవినీతిని బయట పెడుతానన్నారు. ఇప్పటికే నీ చెల్లె జైలుకు పోయింది. మేం రాముడి వారసులం. మీరు బాబర్ వారసులు’ అంటూ కేటీఆర్‌పై బండి సంజయ్ విరుచుకుపడ్డారు.

ఇవి కూడా చదవండి...

Komatireddy Rajagopal Reddy: బీఆర్ఎస్ పాలనలో జోకర్ గాళ్లు, బ్రోకర్ గాళ్లెక్కువ...

Supreme Court: ఇసుక తవ్వకాలపై సుప్రీం ఫైర్.. నిలిపివేయాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశం

Dhulipalla Narendra: జగన్‌కి కప్పం కడితే దోపిడి, హత్యలకు పర్మిషన్ ఇస్తారు

Read Latest AP News AND Telugu News

Updated Date - Apr 29 , 2024 | 01:34 PM