Share News

Dhulipalla Narendra: జగన్‌కి కప్పం కడితే దోపిడి, హత్యలకు పర్మిషన్ ఇస్తారు

ABN , Publish Date - Apr 29 , 2024 | 11:43 AM

2018 మార్చి 14న అప్పటి ప్రతిపక్ష నేత జగన్ రెడ్డి ఈప్రాంతంలో అభివృద్ధి జరగలేదని అన్నారని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయ్య్యాక రాష్ట్రంలో ఇసుక దోపిడీ, అక్రమ మద్యం దోపిడీ చేశారన్నారు. పొన్నూరు నియోజకవర్గంలో రూ.2540 కోట్ల సహజ వనరుల దోపిడీ జరిగిందన్నారు. ఈ రోజు మరలా దోపిడీ కోసం పొన్నూరు నియోజకవర్గానికి వస్తున్నాడన్నారు.

Dhulipalla Narendra: జగన్‌కి కప్పం కడితే దోపిడి, హత్యలకు పర్మిషన్ ఇస్తారు

గుంటూరు: 2018 మార్చి 14న అప్పటి ప్రతిపక్ష నేత జగన్ రెడ్డి ఈప్రాంతంలో అభివృద్ధి జరగలేదని అన్నారని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయ్య్యాక రాష్ట్రంలో ఇసుక దోపిడీ, అక్రమ మద్యం దోపిడీ చేశారన్నారు. పొన్నూరు నియోజకవర్గంలో రూ.2540 కోట్ల సహజ వనరుల దోపిడీ జరిగిందన్నారు. ఈ రోజు మరలా దోపిడీ కోసం పొన్నూరు నియోజకవర్గానికి వస్తున్నాడన్నారు. ఈ దోపిడీపై ముఖ్యమంత్రి జగన్ సమాధానం చెప్పాలని ధూళిపాళ్ల డిమాండ్ చేశారు. రేషన్ బియ్యం మాఫియా ఒక హత్య చేసిందని.. దీనిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

Lankadinakar: జగన్ చేసింది గోరంత.. చెప్పుకునేది కొండంత.. దోచుకుంది అనకొండంత...


ఈ హత్య పై సమాధానం చెప్పాలని ధూళిపాళ్ల డిమాండ్ చేశారు. రేషన్ మాఫీయా లారీకి అడ్డు వచ్చాడని మార్కెట్ యార్డు ఉద్యోగిని హత్య చేశారన్నారు. కిలారు రోశయ్య దళితులను బెదిరించి అనుమర్లపూడి గ్రామంలో రూ.50 కోట్ల భూమిని లాక్కొన్నాడన్నారు. కిలారుపై ముఖ్యమంత్రి ఇంత వరకూ ఏ చర్యా తీసుకోలేదన్నారు. గంజాయి మాఫియాకు పొన్నూరు అడ్డాగా మారిందన్నారు. పొన్నూరు నియోజకవర్గంలో అభివృద్ధి స్థానంలో దోపిడి పెరిగిందన్నారు. అభివృద్ధి పేరుతో ప్రభుత్వ సొమ్ము అడ్డగోలుగా దోచుకున్నారని ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు.

ఆ పధకాలకు జగన్ పేరు ఎందుకు?


జొన్న,మొక్కజొన్న కొనుగోలులో అడ్డగోలుగా దోచుకున్నారన్నారు. రైతుల నష్ట పరిహారంలో అధికార పార్టీ నాయకులు దోపిడీకి పాల్పడ్డారని ధూళిపాళ్ల అన్నారు. జగన్ మోహన్ రెడ్డి కి కప్పం కడితే దోపిడికి.. హత్యలకు పర్మిషన్ ఇస్తారన్నారు. అధికార పార్టీ నాయకులు అధికారాన్ని అడ్డుపెట్టుకుని నయవంచనకు పాల్పడ్డారన్నారు. రోడ్ వైండింగ్‌లో బాధితులకు ఇంతవరకూ నష్టపరిహారం ఇవ్వలేదన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 7000మంది లబ్ధిదారులకు పెన్షన్ తీసేశారన్నారు. ఒక్కసారి అని అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేశారని.. వీటన్నింటిపై ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని ధూళిపాళ్ల డిమాండ్ చేశారు.

ఇవి కూడా చదవండి...

AP Elections: ఏపీలో అక్కడ మాత్రం ప్రచారం నిల్.. డీలా పడిన ప్రధాన పార్టీలు..

MP Arvind: కాంగ్రెస్ గెలిస్తే.. టెర్రరిస్టుల సీరియల్ బాంబ్ బ్లాస్ట్‌లు ఉంటాయి


Read Latest AP News And Telugu News

Updated Date - Apr 29 , 2024 | 11:43 AM