Share News

Lankadinakar: జగన్ చేసింది గోరంత.. చెప్పుకునేది కొండంత.. దోచుకుంది అనకొండంత...

ABN , Publish Date - Apr 29 , 2024 | 11:27 AM

Andhrapradesh: ఏపీలో స్థూల ఉత్పత్తి బాగా వెనుకబడిపోయిందని... తెలంగాణాతో పోలిస్తే చాలా తగ్గిపోయిందని బీజేపీ నేత లంకా దినకర్ వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు పాలనలో స్థూల ఉత్పత్తి ఐదో స్థానంలో ఉంటే.. జగన్ పాలనలో 14వ స్థానానికి పడిపోయిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులు.. వడ్డీలు చెల్లించడానికే సరిపోతుందన్నారు.

Lankadinakar: జగన్ చేసింది గోరంత.. చెప్పుకునేది కొండంత.. దోచుకుంది అనకొండంత...
BJP Leader lanka Dinakar

విజయవాడ, ఏప్రిల్ 29: ఏపీలో (Andhrapradesh) స్థూల ఉత్పత్తి బాగా వెనుకబడిపోయిందని... తెలంగాణాతో (Telangana) పోలిస్తే చాలా తగ్గిపోయిందని బీజేపీ నేత లంకా దినకర్ (BJP Leader Lanka Dinakr) వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు(TDP Chief Chandrababu Naidu) పాలనలో స్థూల ఉత్పత్తి ఐదో స్థానంలో ఉంటే.. జగన్ (CM Jagan)పాలనలో 14వ స్థానానికి పడిపోయిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులు.. వడ్డీలు చెల్లించడానికే సరిపోతుందన్నారు. అభివృద్ధి పనులు చేయడంపై జగన్‌కు కనీస ఆలోచన లేదన్నారు. విద్యుత్ కొనుగోలు, మైనింగ్ అనుమతులు, మద్యం డిస్లరీ అమ్మకాలు ఇలా దోచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పుల్లో కుడా ఆంధ్రప్రదేశ్ దేశంలోనే తొలి స్థానంలో ఉందన్నారు.

Bonda Uma: జగన్‌కు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు...


ఆ పధకాలకు జగన్ పేరు ఎందుకు?

జగన్ అధికారంలోకి వచ్చాక మూల ధనం పూర్తిగా పడకేసిందన్నారు. 2014-19 మధ్య చంద్రబాబు ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం రూ.62వేల 990 కోట్లు ఇచ్చారన్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టలు కోసం కేవలం రూ.26 వేల కోట్లు కేటాయించారని తెలిపారు. 14 లక్షల కోట్లు రాష్ట్రంపై అప్పు ఉంటే.. అందులో ఎనిమిది లక్షల కోట్లు దోచేశారన్నారు. ప్రభుత్వం సొమ్ముతో అమలు చేసే పధకాలకు జగన్ పేర్లు ఎందుకు అని ప్రశ్నించారు. జగన్ చేసింది గోరంత.. చెప్పుకునేది కొండం.. దోచుకుంది అనకొండంత అంటూ విరుచుకుపడ్డారు.

Delhi: సిగ్గెందుకు.. వాటి వాడకంలో మేమే టాప్.. అసద్ సంచలన వ్యాఖ్యలు


ఓట్ల రాజకీయం కోసమే మ్యానిఫెస్టో...

కేంద్ర ప్రభుత్వం పేదల కోసం ఇచ్చే నిధులను తన అవసరాలకు మళ్లించారన్నారు. మోదీ అమలు చేసే పధకాల పేర్లు కూడా మార్చి మరీ తన సొంతంగా ప్రచారం చేశారని విమర్శించారు. వచ్చే ఐదేళ్లల్లో ఆదాయ వనరులు ఎలా పెంచుతారో జగన్ తన మ్యానిఫెస్టోలో పెట్టలేదన్నారు. కేవలం ఓట్ల రాజకీయం కోసమే మ్యానిఫెస్టోను రూపొందించారని తెలిపారు. రాష్ట్రం, యువత, ప్రజలు అందరినీ బలి చేసి అయినా.. తాను సీఎం అవ్వాలనుకునే వ్యక్తి జగన్ అని అన్నారు. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఆంధ్రుడిపైనా ఉందన్నారు. ఇప్పుడైనా అందరూ కలిసి కట్టుగా కదలాలని పిలుపునిచ్చారు. కూటమి పార్టీలుగా ఉన్న బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ‘‘జగన్ మాయలు, మోసాలు మరోసారి నమ్మకండి.. మోసపోకండి’’ అని ప్రజలకు లంకా దినకర్ వినతి చేశారు.


ఇవి కూడా చదవండి...

AP Elections: ఏపీలో అక్కడ మాత్రం ప్రచారం నిల్.. డీలా పడిన ప్రధాన పార్టీలు..

MP Arvind: కాంగ్రెస్ గెలిస్తే.. టెర్రరిస్టుల సీరియల్ బాంబ్ బ్లాస్ట్‌లు ఉంటాయి


Read Latest AP News And Telugu News

Updated Date - Apr 29 , 2024 | 11:31 AM