ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Congress: ఐదు నెలల సర్కార్‌కు శాపనార్ధాలు పెడుతున్నారు: మంత్రి పొన్నం

ABN, Publish Date - Apr 19 , 2024 | 07:53 AM

కరీంనగర్: విపక్షాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బోగస్ గాళ్ళు చేసిన వ్యాఖ్యలను పట్టించుకోవద్దన్నారు. ఐదు నెలల కాంగ్రెస్ సర్కార్‌కు శాపనార్ధాలు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాముడు మీకు మాత్రమే దేవుడా?.. రాముని పేరు లేకుండా ఓట్లు అడగలేరా అని ప్రశ్నించారు.

కరీంనగర్: విపక్షాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బోగస్ గాళ్ళు చేసిన వ్యాఖ్యలను పట్టించుకోవద్దన్నారు. ఐదు నెలల కాంగ్రెస్ సర్కార్‌ (Congress Govt.)కు శాపనార్ధాలు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాముడు మీకు మాత్రమే దేవుడా?.. రాముని పేరు లేకుండా ఓట్లు అడగలేరా అని ప్రశ్నించారు. చేసిందేమీ లేక రాముణ్ణి వాడుకుంటారా అంటూ బీజేపీపై ధ్వజమెత్తారు.


రొటీన్‌గా వచ్చే పథకాలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) ఇచ్చినట్టు చెప్పుకుంటున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూలుతుందని కేసీఆర్ (KCR) పిల్లి శాపనార్థలు పెడుతున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) బీజేపీ (BJP)లోకి వెళ్తారని బీజేపీ, బీఆర్ఎస్ (BRS) పార్టీలు కుట్రలు చేస్తున్నాయన్నారు. వచ్చే వానాకాలం నుంచి రూ. 500 బోనస్ ఇస్తామని స్పష్టం చేశారు. రూ.15 లక్షల నల్లధనం ప్రజల అకౌంట్‌లలో పడిందా? అని బీజేపీని ఉద్దేశించి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు.


దేశంలో రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి, నియంతృత్వానికి వ్యతిరేకంగా అందరు ఆలోచన చేయాలని పొన్నం ప్రభాకర్ సూచించారు. పదేళ్లలో బీజేపీ, బీఆర్ఎస్ ఎంపీలు రాష్ట్రానికి ఏమి చేశాయో చెప్పి ఓట్లు అడగాలని పొన్నం ప్రభాకర్ అన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

సీఎస్‌, డీజీపీ, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌లపై ఫిర్యాదులు

టీడీపీ నాయకులపై పిడిగుద్దులు

తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 19 , 2024 | 07:55 AM

Advertising
Advertising