ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

MLC Kavitha: కస్టడీలో ఉన్న కవితకు కొన్ని వెసులుబాట్లు.. అవేంటంటే..

ABN, Publish Date - Apr 12 , 2024 | 08:56 PM

దిల్లీ మద్యం కేసులో సీబీఐ కస్టడీలో ఉన్న ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు (BRS MLC Kavitha) న్యాయస్థానం కొన్ని వెసులుబాట్లు కల్పించింది. ప్రతి 48 గంటలకు ఒకసారి వైద్యపరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది.

దిల్లీ మద్యం కేసులో సీబీఐ కస్టడీలో ఉన్న ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు (BRS MLC Kavitha) న్యాయస్థానం కొన్ని వెసులుబాట్లు కల్పించింది. ప్రతి 48 గంటలకు ఒకసారి వైద్యపరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. రోజూ సాయంత్రం 6 నుంచి 7గంటల వరకు న్యాయవాది, కుటుంబ సభ్యులను కలిసేందుకు అనుమతి ఇచ్చింది. న్యాయవాది మోహిత్ రావు, భర్త అనిల్ కుమార్, సోదరుడు కేటీ రామారావు (కేటీఆర్), పీఏ శరత్‌చంద్రలకు అనుమతి లభించింది. వీరితో పాటు ఇంటి భోజనం తీసుకొచ్చేందుకు విద్యానిధి పరాంకుశానికి సైతం అనుమతి ఇచ్చింది. న్యాయవాది, కుటుంబ సభ్యులు కలిసే సమయంలో సీబీఐ అధికారులు అక్కడ లేకుండా ఉండేలా ఏర్పాట్లు చేసింది.


Revanth Reddy: ధాన్యం కొనుగోళ్లపై సీఎం కీలక ఆదేశాలు.. అలా చేస్తే చర్యలు తప్పవని వార్నింగ్..

కస్టడీలో ఉన్న సమయంలో కవితకు ఇంటి నుంచి తెచ్చిన భోజనం తినేందుకు కోర్టు అనుమతిచ్చింది. జపమాల, దుస్తులు, పరుపు, బెడ్‌షీట్లు, టవల్స్, పిల్లోను కూడా ఉపయోగించుకోవచ్చని తెలిపింది. కవిత చదువుకోడానికి ది పారడాక్సికల్ ప్రైమ్ మినిస్టర్, ఎలాన్ మస్క్, ది నట్‌మెగ్స్ కర్స్, రెబెలా ఎగెనెస్ట్ ది రాజ్, రోమన్ స్టోరీస్ పుస్తకాలు అనుమతిచ్చింది.


కాగా.. దిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు మూడు రోజుల పాటు సీబీఐ కస్టడీ విధిస్తూ దిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పునిచ్చింది. ఏప్రిల్ 15వ తేదీ వరకు సీబీఐ కస్టడీలో ఉండనున్నారు ఎమ్మెల్సీ కవిత. ఏప్రిల్ 15న ఉదయం 10 గంటలకు తిరిగి కోర్టులో హాజరుపర్చాలని దిల్లీ కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. నేటి నుంచే మూడు రోజుల పాటు కవితను సీబీఐ విచారించనుంది.

AP Elections: అలాంటి వారి వల్ల పోలీస్ వ్యవస్థ భ్రష్టుపట్టిపోయింది.. వర్ల రామయ్య..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.

Updated Date - Apr 12 , 2024 | 08:56 PM

Advertising
Advertising