ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral Video: నడుస్తూ వెళ్తున్నా.. తప్పని ప్రమాదం.. అయినా ఇలా జరుగుతుందని ఎవరైనా ఊహిస్తారా..

ABN, Publish Date - Apr 07 , 2024 | 07:40 PM

అదృష్టం బాగుంటే.. మిన్ను విరిగి మీద పడ్డా ఏమీ కాదు. అదే టైం బాగోలేని సమయంలో అరటిపండు తిన్నా పండు విరుగుతుంది. ఇందుకు నిదర్శనంగా నిత్యం మన కళ్ల ముందు ఎన్నో సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. వీటిలో కొన్ని సంఘటనలు చూస్తే అశ్చర్యం కలిగితే.. మరికొన్ని...

అదృష్టం బాగుంటే.. మిన్ను విరిగి మీద పడ్డా ఏమీ కాదు. అదే టైం బాగోలేని సమయంలో అరటిపండు తిన్నా పండు విరుగుతుంది. ఇందుకు నిదర్శనంగా నిత్యం మన కళ్ల ముందు ఎన్నో సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. వీటిలో కొన్ని సంఘటనలు చూస్తే అశ్చర్యం కలిగితే.. మరికొన్ని సంఘటనలు చూస్తే .. అయ్యో పాపం..! అని అనిపిస్తుంటుంది. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వృద్ధుడు రోడ్డుపై నడుస్తూ వెళ్తుండగా.. ఉన్నట్టుండి ఏం జరిగిందో చూడండి..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన బ్రెజిల్‌లో (Brazil) జరిగినట్లుగా తెలుస్తోంది. ఓ వృద్ధుడు రోడ్డు పక్కన నడుస్తూ వెళ్తుంటాడు. ఆ రోడ్డులో ఎలాంటి రద్దీ లేకపోవడంతో వృద్ధుడు ప్రశాంతంగా నడుస్తూ వెళ్తు్న్నాడు. అయితే ఈ సమయంలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కాస్త దూరం వెళ్లగానే అక్కడి నేల ఒక్కసారిగా కుంగిపోయి (sinking hole in the ground) పెద్ద గొయ్యి ఏర్పడింది.

Viral Video: అందరి ముందే విద్యుత్ తీగను పట్టుకున్న వ్యక్తి.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

వృద్ధుడి పాదాల కింద నేల కూలిపోవడంతో అతను కూడా ధబేల్‌మని అందులో పడిపోతాడు. నేల కూలడంతో పక్కనే ఉన్న పెద్ద గోడ కూడా కూలి గుంతలో పడిపోతుంది. ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది. పరిస్థితి చూస్తుంటే వృద్ధుడికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అయ్యో..! పాపం.. ఎంత ఘోరం జరిగింది’’.. అంటూ కొందరు, ‘‘విధి రాతను ఎవరూ తప్పించలేరు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: అమ్మాయి నాగిని డాన్స్ చూసి ఆగలేకపోయిన అంకుల్.. మధ్యలో సడన్‌గా ఏం చేశాడంటే..

Updated Date - Apr 07 , 2024 | 07:40 PM

Advertising
Advertising