Share News

Viral Video: అమ్మాయి నాగిని డాన్స్ చూసి ఆగలేకపోయిన అంకుల్.. మధ్యలో సడన్‌గా ఏం చేశాడంటే..

ABN , Publish Date - Apr 07 , 2024 | 06:21 PM

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో పంక్షన్ ఏదైనా అందులో ఎంతో కొంత ఎంటర్‌టైన్‌మెంట్ ఉండి తీరాల్సిందే. సాధారణంగా.. ఇంట్లో నిర్వహించుకునే ఏదైనా కార్యక్రమంలో కొందరు ఎంతో హుషారుగా డ్యాన్సులు చేస్తుంటారు. తమకు డ్యాన్స్ రాకపోయినా సరే, ఆ సమయంలో...

Viral Video: అమ్మాయి నాగిని డాన్స్ చూసి ఆగలేకపోయిన అంకుల్.. మధ్యలో సడన్‌గా ఏం చేశాడంటే..

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో పంక్షన్ ఏదైనా అందులో ఎంతో కొంత ఎంటర్‌టైన్‌మెంట్ ఉండి తీరాల్సిందే. సాధారణంగా.. ఇంట్లో నిర్వహించుకునే ఏదైనా కార్యక్రమంలో కొందరు ఎంతో హుషారుగా డ్యాన్సులు చేస్తుంటారు. తమకు డ్యాన్స్ రాకపోయినా సరే, ఆ సమయంలో ఉండే ఉత్సాహంలో నచ్చినట్టు స్టెప్పులేసి, బంధుమిత్రులను సంతోషపరుస్తుంటారు. ఇప్పుడు ఓ వ్యక్తి సైతం అదే పని చేశాడు. నాగిని డ్యాన్స్ చేస్తున్న అమ్మాయిని చూసి పూనకం వచ్చిన ఆయన.. చివరకు ఉన్నట్టుండి ఏం చేశాడంటే..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ బర్త్‌డే ఫంక్షన్‌లో (Birthday function) అంతా సంతోషంగా గడుపుతుంటారు. ఈ క్రమంలో ఓ మహిళ (woman) నాగిని పాటకు డాన్స్ చేసేందుకు రెడీ అవుతుంది. చుట్టూ అంత మంది ఉన్నా ఎలాంటి బిడియం లేకుండా.. అచ్చం నాగిని తరహాలోనే డాన్స్ వేసింది. ఆమెతో పాటూ ఓ వృద్దుడు డాన్స్ వేస్తూ బూర ఊదినట్లు నటించాడు. ఇద్దరూ పాటలో లీనమై డాన్స్ (Dance) చేస్తుండగా.. దూరంగా ఉన్న మరో వృద్ధుడు ఆగలేకపోయాడు.

Viral Video: కూల్‌డ్రింక్స్ ఎత్తుకెళ్లాలని వచ్చాడు.. చివరకు ఎలా బుక్కయ్యాడంటే..

పరుగెత్తుకుంటూ వచ్చి మహిళ పక్కగా వెళ్లి కాస్త దూరంలో పడుకుని దొర్లుతూ నాగిని డాన్స్ చేశాడు. అతడి ఉత్సాహం చూసి సదరు మహిళ కూడా మరింత ఉత్సాహంగా డాన్స్ చేసింది. ఈ ముగ్గురి డాన్స్ చూసి చుట్టూ ఉన్న వారంతా ఈలలు, కేకలు వేస్తూ ఉత్సాహపరిచారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ మహిళ డాన్స్ సూపర్’’.. అంటూ కొందరు, ‘‘అంకుల్ బాగా ఎమోషనల్ అయ్యాడు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: అసలు విషయం చెప్పగానే పగలబడి నవ్విన వధువు.. ఇంతకీ వధువు చెల్లెళ్లు చేసిన నిర్వాకం ఏంటంటే..

Updated Date - Apr 07 , 2024 | 06:21 PM