Share News

Viral Video: పంతానికి పోయి చేతులతో కుస్తీ పడుతున్నారా.. ఈ యువకుడికి ఏమైందంటే..

ABN , Publish Date - Apr 06 , 2024 | 08:19 PM

ప్రస్తుత యువతలో కొందరు చెడు అలవాట్లకు బానిసలై జీవితాలను నాశనం చేసుకుంటుంటే.. మరికొందరు సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలనే ఉద్దేశంతో చివరకు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇంకొందరు పంతానికి పోయి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇలాంటి...

Viral Video: పంతానికి పోయి చేతులతో కుస్తీ పడుతున్నారా.. ఈ యువకుడికి ఏమైందంటే..

ప్రస్తుత యువతలో కొందరు చెడు అలవాట్లకు బానిసలై జీవితాలను నాశనం చేసుకుంటుంటే.. మరికొందరు సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలనే ఉద్దేశంతో చివరకు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇంకొందరు పంతానికి పోయి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ యువకుడు తన స్నేహితుల ముందు పంతానికి పోయి చివరకు తీవ్రంగా దెబ్బతిన్నాడు. చేతులతో కుస్తీ పడుతుండగా ఏం జరిగిందో చూడండి..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ స్టేజీ మీద చేతులతో కుస్తీ పట్టే (Arm wrestling) పోరాటం జరుగుతుంటుంది. అనుభవం ఉన్న ఓ వ్యక్తి చేతిలో చాలా మంది ఓడిపోతుంటారు. ఈ క్రమంలో అక్కడున్న యువకులంతా తమ స్నేహితుడిని పోటీకి దింపుతారు. అతను కూడా వారి ముందు పంతానికి పోయి అంగీకరిస్తాడు. చివరకు ఎదురుగా ఉన్న వ్యక్తి ముందు కూర్చుని, చేయి చేయి కలిపి కుస్తీకి దిగుతాడు. అవతలి వ్యక్తి ఎంతో బలంగా ఉండడంతో పాటూ ఈ ఆటలో అనుభవం ఉండడంతో యువకుడికి చేయిని నేలకు ఆనించే ప్రయత్నం చేస్తాడు.

Viral Video: ఎద్దుల అంబాసిడర్.. ఇలాంటి విచిత్ర వాహనాన్ని ఎప్పుడైనా చూశారా..

కుస్తీ పోటీలో ఓడిపోతే అందరి ముందూ పరువు పోతుందనే ఉద్దేశంతో సదరు యువకుడు.. కుస్తీలో గెలిచేందుకు శతవిధాలా ప్రయత్నిస్తాడు. అవతలి వ్యక్తిని ఓడించేందుకు తన శక్తికి మించి సాహసం చేస్తాడు. ఈ క్రమంలో అవతలి వ్యక్తి యువకుడి చేయిని బలంగా నేలపై ఆనిస్తాడు. దీంతో ఒక్కసారిగా చేయి విరిగిపోయి, ఫట్‌మని శబ్ధం వస్తుంది. దీంతో పక్కన ఉన్న వారంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. చేయి విరగడంతో సదరు యువకుడు నొప్పితో విలవిల్లాడిపోతాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు. ‘‘శక్తికి మించిన సామసం చేయొద్దు’’.. అంటూ కొందరు, ‘‘అయ్యో పాపం..! ఎంత దారుణం’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 4 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఒకే ఇంటిపై చిరుత, ఎలుగుబంటి.. చివరకు ఏమైందో చూడండి..

Updated Date - Apr 06 , 2024 | 08:19 PM